Begin typing your search above and press return to search.
ఈ షేవింగ్ టిప్స్ పాటిస్తే.. చర్మం మృదువుగా ఉంటుంది!
By: Tupaki Desk | 22 July 2015 6:56 AM GMTషేవింగ్ తో చర్మం రఫ్ తయారవుతుందనే భయం అబ్బాయిలకు మామూలే. 20 యేళ్ల వయసు నుంచి రెగ్యులర్ గా చేసే షేవింగ్ తో చర్మంలో మృదుత్వం తగ్గిపోతుంది. క్లీన్ షేవ్ కూడా అందమే అయినా.. చర్మతత్వాన్ని పట్టి షేవింగ్ తో ఫేస్ అందం చెడిపోతూ ఉంటుంది. ఇలాంటి నేపథ్యంలో షేవింగ్ తో మొహత్వచంలోని మృదుత్వాన్ని కాపాడుకోవడానికి కొన్ని టిప్స్ ఉన్నాయి. సొంతంగా షేవ్ చేసుకొనే వాళ్లు ఈ టిప్స్ ను పాటించవచ్చు.
మొదట... ముందుగా మొహంపై గోరువెచ్చని నీటిని చల్లుకోవాలి. ఫేస్ వాష్ లేదా మైల్డ్ క్లీనర్స్ ను అప్లై చేయాలి. దీని వల్ల గడ్డం మృదువుగా మారుతుంది. ఫలితంగా ముఖంపై బ్లేడ్ సులువుగా రన్ అవుతుంది.
స్టెప్ టూలో ముఖాన్ని టవల్ తోతుచుకోవాలి. తడి లేకుండా.. వెచ్చగా ఉన్న టవల్ తో తుడుచుకొంటే మంచిది.
షేవింగ్ క్రీమ్ ను గుండ్రంగా అప్లై చేసుకోవాలి. దీని వల్ల వెంట్రుకలు కొంత నిలుచుంటాయి. దీంతో అవి షేవింగ్ కు అనువుగా మారతాయి.
రేజర్ యాంగిల్ కూడా ముఖ్యమే. గడ్డం ఏ దిశలో పెరుగుతుందో.. ఆ దిశగానే షేవ్ చేయాలి.
బుగ్గలు, చుబుకం, మెడదగ్గర చర్మాన్ని కొద్దిగా లాగుతూ షేవ్ చేయాలి. దీని వల్ల ఎక్కడా ఫోల్డ్స్ ఉండవు.
చీక్ బోన్స్ పై ఎక్కడైనా వెంట్రుకలు మిగిలిపోయాయేమో చెక్ చేసుకోవాలి. అవసరమైతే పై ప్రక్రియను అంతా రిపీట్ చేయాలి. రేజర్ ను వెంట్రుకలు పెరిగిన దిశకు వ్యతిరేకంగా లాగితే మరింత క్లీన్ షేవ్ అవుతుంది కానీ.. గాట్లు పడే అవకాశం ఉంది.