Begin typing your search above and press return to search.
ఆనందకరమైన శృంగారంలో భారతీయులు ముందున్నారు!
By: Tupaki Desk | 8 July 2015 7:46 AM GMT పేరుకు అభివృద్ధి చెందుతూ ఉన్న దేశమే అయినా మనదేశంలోని జనులు మాత్రం జీవితాలను బాగా ఆస్వాధిస్తున్నారని అంటున్నాయి అంతర్జాతీయ స్టడీలు. ఎలా ఉన్నా.. ఏం చేస్తున్నా.. ఆనందమే పరమావధి అనుకొంటే.. జీవితం అంతా దాన్ని ఆస్వాధించడమే గొప్ప అనుకొంటే.. అలాంటి ఆనందంలో శృంగారం కూడా కీలకం అనుకొంటున్న నేటి గణాంకాల ప్రకారం చూస్తే భారతీయులు చాలా గొప్ప జీవితాలనే అనుభవిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో శృంగార జీవితాలను బాగా ఆస్వాధిస్తున్న దేశాల వారి జాబితాను తయారు చేస్తే భారత్‌కు టాప్‌టెన్ లో స్థానం దక్కింది.
వర్తమాన ప్రపంచంలో ప్రముఖదేశాల పరిధిలో చేపట్టిన సర్వేలో ఇండియాకు ఎనిమిదో స్థానం దక్కింది. శృంగారాన్ని బాగా ఆస్వాధిస్తున్నామని స్విస్ దేశస్తులు చెప్పుకొన్నారు. తమ శృంగార జీవితాలు చాలా ఆనందమయం అని వారు వివరించారు. ఇక ఆ తర్వాతిస్థానంలో స్పెయిన్ నిలిచింది. ఆ వెంటనే ఇటలీ, బ్రెజిల్, గ్రీస్, హాలెండ్, మెక్సికోలు నిలిచాయి. ఈ జాబితాలో ఇండియాకు ఎనిమిదో స్థానం దక్కింది.
భారత్ తర్వాత ఆస్ట్రేలియా, నైజీరియా దేశాలు శృంగారాన్ని తనివితీరా ఆస్వాధిస్తున్న జనులున్నదేశాలుగా నిలిచాయి. స్త్రీ, పురుషులిద్దరి అభిప్రాయాలనూ తీసుకొని ఈ సర్వేను చేపట్టారు. అయితే ఈ సర్వేలో పాల్గొనడాన్ని కొన్ని ముస్లిందేశాలు నిషేధించాయి. తమ దేశ జనుల నుంచి ఇలాంటి అభిప్రాయాలు తీసుకోవడానికి వీలు లేదని అక్కడి దేశాల ప్రభుత్వాలు ఉత్తర్వులు ఇవ్వడం విశేషం.
మరి వారి సంగతలా ఉంటే.. ఆనందకరమైన జీవితం అంటే దానితో శృంగారం కూడా ముడిపడి ఉంటుందనుకొంటే.. అలాంటి జీవితాస్వాధనలో భారతీయులు మంచి పొజిషన్‌లో ఉన్నారనమాట!