Begin typing your search above and press return to search.

సంభోగం క‌న్నా... స్మార్ట్ ఫోన్ మిన్న‌

By:  Tupaki Desk   |   29 July 2015 1:29 PM GMT
సంభోగం క‌న్నా... స్మార్ట్ ఫోన్ మిన్న‌
X
భార‌తీయుల ఆచ‌ర వ్య‌వ‌హారాల‌పై స‌ర్వేలు జ‌ర‌గ‌డం కొత్త కాదు. ఆ స‌ర్వేల్లో కొత్త కొత్త విష‌యాలు వెలుగులోకి రావ‌డం కూడా ఆస‌క్తిక‌ర‌మేం కాదు. కానీ మారుతున్న కాలానికి త‌గ్గ‌ట్లు వ‌స్తుమ‌యం అయిపోతున్న స‌మాజంలో సంబంధాల క‌న్నా...స్మార్ట్ డివైజ్‌ల‌కే ప్రాధాన్యం ఇవ్వ‌డం గ‌మ‌నార్హం. స్మార్ట్ ఫోన్‌ల వాడ‌కం విష‌యంలో భార‌తీయుల ఆచార వ్య‌వ‌హారాల‌పై తాజాగా విడుద‌ల‌యిన ఓ స‌ర్వే ఫ‌లితాలు ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తున్నాయి.

కేఆర్‌సీ రీసెర్చ్ అనే సంస్థ ఆన్‌లైన్ స‌ర్వే నిర్వ‌హించింది. ఈ క్ర‌మంలో 7000 మంది భార‌తీయుల‌ను స్మార్ట్‌ ఫోన్‌ల వాడ‌కంపై వివిధ ప్ర‌శ్న‌లు అడిగింది. వారిచ్చిన స‌మాధానాలు క్రోడిక‌రిస్తే ఆశ్చ‌ర్య‌క‌ర ఫ‌లితాలు వ‌చ్చాయి. స్మార్ట్ ఫోన్ వినియోగ‌దారుల్లో దాదాపు 74 శాతం మంది నిద్రపోతున్న స‌మ‌యంలోనూ వారి ఫోన్ల‌ను వ‌ద‌ల‌డం లేదట‌. స్మార్ట్ ఫోన్ వినియోగ‌దారుల్లో కొత్త ట్రెండ్ ఏమంటే...కొత్తగా పెళ్ల‌యిన వారు త‌మ జీవిత భాగ‌స్వామితో సెక్స్‌ లో పాల్గొన‌డం కంటే....స్మార్ట్‌ పోన్‌తో స‌మ‌యం గ‌డ‌ప‌డానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నార‌ని ఆ స‌ర్వే తేల్చింది.

స‌ర్వేలో పాల్గొన 54%ప్ర‌జ‌లు వ‌ర్షం ప‌డుతున్నా...కారు న‌డుపుతున్నా త‌మ స్మార్ట్‌ ఫోన్‌ను వ‌దిలిపెట్ట‌డం లేద‌ని తేల్చిచెప్పార‌ట‌. 98% భార‌తీయులు వారు నిద్ర‌పోతున్న స‌మ‌యంలోనూ అందుబాటులోనే ఉండే విధంగా స్మార్ట్‌ ఫోన్‌ను ద‌గ్గ‌ర‌పెట్టుకుంటున్నార‌న‌ట‌. 83% ప్ర‌జ‌లు రోజులో త‌మ వెంట‌నే ఫోన్ అట్టిపెట్టుకుంటున్నార‌ని స‌ర్వే తేల్చింది.

అమెరికా, బ్రిట‌న్‌, బ్రెజిల్‌, చైనా, మెక్సికో, భార‌త‌దేశాల్లో ఈ స‌ర్వేను నిర్వ‌హించారు.