Begin typing your search above and press return to search.

ఆన్‌ సెట్స్‌ తిండిలో కొత్త మలుపులు

By:  Tupaki Desk   |   1 Aug 2015 6:03 AM GMT
ఆన్‌ సెట్స్‌ తిండిలో కొత్త మలుపులు
X

చికెన్‌ ధమ్‌ బిరియాని, మటన్‌ బిరియాని, పావు బాజీలు తినే రోజులు పోయాయి. ఇప్పుడంతా హెల్త్‌ ఫుడ్‌ కి అలవాటు పడిపోతున్నారు. వైట్‌ రైస్‌ పూర్తిగా మానేస్తున్నారు. ఆయిల్‌ ఫుడ్స్‌ కి టాటా చెప్పేస్తున్నారు. అప్పనంగా దొరికేదే కదా అని ఏది పడితే అది తినేయడం లేదు. వాటి స్థానంలో పరిమిత ఆహారం పేరుతో చపాతీలు, బ్రౌన్‌ రైస్‌ వంటి ఆరోగ్యకర ఆహార విధానాన్ని అనుసరించే రోజులు వచ్చేశాయి.

మోడ్రన్‌ లైఫ్‌ స్టయిల్‌ లో ఇదో కొత్త ట్రెండ్‌. కాస్త కాసుల గళగళలు ఉన్న చోటల్లా ఈ కొత్త ఆహారపు అలవాట్లు పురుడు పోసుకుంటున్నాయి. ఈ ట్రెండ్‌ ఇప్పుడు ఫిలింసర్కిల్స్‌ లోకి కూడా వచ్చి చేరింది. కార్మికుల స్థాయిలో ఆహారాన్ని ఎంపిక చేసుకునేంతటి అవకాశం లేదు కానీ, చిత్రయూనిట్‌ లో కీలకమైన డైరెక్షన్‌ డిపార్ట్‌ంట్‌, కెమెరా, స్టార్ల వరకూ అయితే కావాల్సిన తిండిని ఎంపిక చేసుకునే ఫ్లెక్సిబిలిటీ ఉంది. లంచ్‌ బ్రేక్‌ లో మామూలు బిరియానీల స్థానంలో బ్రౌన్‌ రైస్‌ ని ప్రిఫర్‌ చేస్తున్నారు.

అలాగే నాన్‌ వెజిటేరియన్‌ లో గ్రిల్డ్‌ ఫిష్‌ కి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారు. వీటివల్ల ఆరోగ్యం చెక్కు చెదరదు. ఇతరత్రా తిండి పదార్థాల వల్ల ఆరోగ్యానికి కచ్ఛితంగా ముప్పు వాటిల్లుతోంది.