Begin typing your search above and press return to search.

202 కోట్ల ఇంటిని కొన్నదెవరో?

By:  Tupaki Desk   |   8 Aug 2015 9:45 AM GMT
202 కోట్ల ఇంటిని కొన్నదెవరో?
X
ముంబయి రియల్ ఎస్టేట్ మార్కెట్ లో రికార్డులు ఎక్కువ కాలం నిలవడం లేదు.. తరచూ కొత్త రికార్డులు నమోదవుతున్నాయి. తాజాగా ముంబయి దక్షిణ ప్రాంతంలోని నాపియన్ సీ రోడ్ ప్రాంతంలో ఓ ట్రిప్లెక్స్ ఇంటికి రికార్డు స్థాయి ధర పలికింది. ఏకంగా రూ.202 కోట్ల ధర పలికిందట. దేశంలో ఇంతవరకు ఏ నివాస గృహానికీ ఇంత రేటు రాలేదని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

17 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలోని ఈ విలాసవంతమైన భవనాన్ని ఓ ప్రముఖ పారిశ్రామికవేత్త కొనుగోలు చేస్తున్నారు. రున్వాలా గ్రూప్ నిర్మిస్తున్న అపార్టుమెంటులోని 20, 21, 22 అంతస్తుల్లో ఈ ట్రిప్లెక్స్ ఇల్లు ఉంది. దీనిపైనుంచి చూస్తే అరేబియా సముద్రం, క్వీన్స్ నెక్లస్ రోడ్ కనిపిస్తాయి. 21 కార్లు నిలుపుకొనేందుకు ఈ ఒక్క ఇంటికే పార్కింగు సదుపాయం ఉంది.

కాగా కొనుగోలు చేస్తున్నదెవరన్నది ఇంకా వెల్లడించకపోయినా ప్రముఖ పారిశ్రామికవేత్త అని మాత్రం చెబుతున్నారు. కొనుగోలుదారుకు దీన్ని 2018 మార్చి నాటికి పూర్తిగా నిర్మించి అప్పగిస్తారట. అయితే.. ఇంత భారీ డీల్ కావడంతో దీన్ని కొన్నదెవరా అని రియల్ రంగంలో, సాధారణ ప్రజల్లోనూ ఆసక్తి నెలకొంది.