Begin typing your search above and press return to search.

అఘోరాల గురించి కళ్ల చెరిరే నిజాలు

By:  Tupaki Desk   |   5 July 2015 5:34 PM GMT
అఘోరాల గురించి కళ్ల చెరిరే నిజాలు
X
అఘోరాల గురించి మనకు పెద్దగా తెలిసింది లేదు. ఎందుకంటే వాళ్లు మన చుట్టుపక్కల ఉండరు. వాళ్ల జీవన శైలి ఎలా ఉంటుందో తెలియదు. అప్పుడప్పుడూ సినిమాల్లో అఘోరా పాత్రలు కనిపిస్తుంటాయి. ఐతే ఆయా దర్శకుల సృజనను బట్టి వారి ప్రవర్తన ఉంటుంది. ఐతే నిజంగా అఘోరాలు ఎలా ఉంటారు? వాళ్లేం తింటారు? ఏం చేస్తారు? తెలుసుకుందాం పదండి.

! అఘోరాలు శవాల్ని భక్షిస్తారన్నది అబద్ధమేమీ కాదు. వాళ్లు నిజంగానే శవాల్ని భక్షిస్తారు. శవాల్ని వాళ్లు ప్రేమిస్తారు కూడా. వారి సంప్రదాయ పూజలన్నీ పుర్రెలతో ముడిపడి ఉంటాయి కూడా.

! అఘోరాలు శివ భక్తులు. అందుకే వారి సహవాసం శవాలతో ఉంటుంది. శ్మశానాల్లో బతకడానికి వాళ్లేమీ సంకోచించరు.

! అఘోరాలు మద్యం తాగుతారు. మాంసం తింటారు. సెక్స్‌ సాధన ద్వారా దేవత సంతృప్తి చెందుతుందని నమ్ముతారు. అఘోరాలు మానవ మలం తింటారని కూడా అంటారు.

! అఘోరాలు ఆచరించే విషయాల్లో శవ సంగమం ఒకటి. కాళి మాత ప్రసన్నం కోసం శవంతో శృంగారం చేయాలని భావిస్తారు. ఇందుకోసం ఓ అనుకూలమైన శవాన్ని ఎంచుకుంటాడు. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో ఓ అఘోరా వెల్లడించడం విశేషం.

! అఘోరాలకు చేతబడి చేసే, ఇతర మానవాతీత శక్తులు ఉంటాయని నమ్మకం. చనిపోయిన వారితో సెక్స్‌ చేస్తే అతీంద్రయ శక్తులు సంక్రమిస్తాయని వారు నమ్ముతారు.

! తాము తినే గిన్నెలోనే కుక్కలు, ఆవులకు కూడా ఆహారం పెట్టి తినిపిస్తారు. ప్రతికూల ఆలోచనలు తొలగించడానికి.. శివుడి అనుగ్రహం పొందడానికి వారిలా చేస్తారని చెబుతారు.

! ఒంటిమీద జనపనారతో చేసిన గోచీ తప్ప ఇంకేమీ ఉండదు. కొందరు మొత్తం నగ్నంగా కూడా ఉంటారు. ఐతే ఒంటికి బూడిద మాత్రం రాస్తారు. వ్యాధులు, దోమల నుంచి బూడిద తమను రక్షిస్తుందని వారు భావిస్తారు.

! పవిత్ర పురుషులుగా భావించేవారి శవాల పుర్రెల్ని సంపాదించడం అఘోరాల విధి. మద్యం తాగడానికి, ఆహారం తీసుకోవడానికి ఆ పుర్రెనే ఓ భిక్ష పాత్రలా ఉపయోగిస్తారు.

! అఘోరాలు నిద్రలో శాంతి ధ్యానం కూడా చేస్తారు.

! అఘోరాలు బూతులు ఎక్కువగా మాట్లాడతారు. బిగ్గరగా అరుస్తారు. అఘోరాలు జ్ఞానోదయం కోసమే ఇలా చేస్తారని చెబుతారు. వారిలా బూతులు తిడితే ప్రజలు వాటిని దీవెనలుగా భావిస్తారు.

! కొందరు అఘోరాలు శవాల నుంచి తొడ ఎముకను తీసి.. తమకు ఊతకర్రగా వినియోగిస్తారు.

! జుట్టును కత్తిరించడం.. శుభ్రం చేసుకోవడం అఘోరాలకు అలవాటు లేని పని.

! అఘోరాలు గంజాయి పీలుస్తారు. తమ దినచర్యలు నిర్వహించడానికి, బలమైన ధ్యాన పద్ధతులపై దృష్టిపెట్టడానికి ఇది సహాయపడుతుందని వారి నమ్మకం.