Begin typing your search above and press return to search.
పెళ్లాన్ని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త
By: Tupaki Desk | 8 Aug 2015 5:51 AM GMTవినేందుకు సినిమా కథ మాదిరే ఉండే ఈ వ్యవహారం రియల్ గా జరిగింది. మారిన సమాజంలో ఏదైనా సాధ్యమేనని చెప్పటానికి ఈ ఉదంతం ఒక నిదర్శనం. నచ్చని బతుకుల్ని కాల రాయటం కంటే కూడా కోరిన వారికి కట్టబెట్టటంలోనే ఆనందం ఉందని.. నిజంగా ఒకరిని అభిమానిస్తే.. ఎదుటి వారిని సంతోషంగా ఉంచటమే సరైన తీరుగా తన చేతల్లో చేసి చూపించాడో యువకుడు.
ఉత్తరప్రదేశ్ లోని ఫైజాబాద్ లో జరిగిన ఈ రియల్ స్టోరీలోకి వెళితే..
ఫైజాబాద్ కు చెందిన ఫూల్ చంద్ పెద్దలు కుదర్చిన పెళ్లి చేసుకున్నారు. భార్య చందాను ఇంటికి తెచ్చుకున్నాడు. ఉద్యోగంలో భాగంగా జలంధర్ కు వెళ్లాడు. మూడేళ్లుగా భార్యతో ఫోన్లు మాట్లాడుతూ కాలం గడిపేవాడు. కొద్దికాలం అనంతరం తాజాగా ఇంటికి వచ్చిన అతనికి భార్య చందా పెద్ద షాక్ ఇచ్చింది. తాను మరొకరిని ప్రేమించానని.. అతడినే పెళ్లి చేసుకోవాలని భావించానని.. కానీ.. పెద్దల ఒత్తిడి తట్టుకోలేక పెళ్లి చేసుకున్నానని.. ఇక.. తనకు కాపురం చేయటం సాధ్యం కాదని తేల్చేసింది.
తాను ప్రేమించిన వ్యక్తినే తానిప్పటికీ ఇష్టపడుతున్నానని.. అతడితోనే తన జీవితం అంటూ చెప్పటంతో.. సగటు మగాడిలానే పూల్ చంద్ ఆవేశపడ్డాడు. కానీ.. ఆలోచిస్తే.. ఆమె చెప్పిన విషయం అర్థమైంది. వెంటనే.. భార్య తల్లిదండ్రుల్ని.. పిలిపించి వారితో మాట్లాడి.. గ్రామ పెద్దలకు సర్ది చెప్పి.. చివరకు ఆమె కోరుకున్న వ్యక్తితో ధూంధాంగా పెళ్లి జరిపించటమే కాదు.. కానుకలతో అతనితో కాపురానికి పంపటంతో ఒక కథ సుఖాంతమైంది.
కట్టుకున్నన భార్యను.. ఆమెకు నచ్చిన వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేసిన పెద్ద మనిషిగా మిగిలి.. వార్తల్లో వ్యక్తిగా మారిపోయి.. త్యాగానికి సరికొత్త నిర్వచనంగా నిలిచిన అతగాడు.. ఒంటరిగా మిగిలిపోయాడు.