Begin typing your search above and press return to search.

మ‌నిషికి ఆవుగుండె..?

By:  Tupaki Desk   |   16 July 2015 9:01 AM GMT
మ‌నిషికి ఆవుగుండె..?
X
విన‌టానికి కాస్తంత విచిత్రంగా ఉన్న ఇది నిజం. అందుబాటులోకి వ‌చ్చిన అత్యాధునిక సాంకేతిక‌తో న‌మ్మ‌క‌శ్యంకానిరీతిలో ఒక వృద్ధురాలికి ఆవు గుండెను విజ‌య‌వంతంగా అమ‌ర్చారు.

గుండె సంబంధిత వ్యాధితో ఒక వృద్ధురాలు ప‌ద‌కొండేళ్లుగా ఇబ్బంది ప‌డుతున్నారు. గ‌తంలో ఆమెకు ఆప‌రేష‌న్ చేసి వాల్వ్ అమ‌ర్చారు. కొంత‌కాలంగా ఆరోగ్యం బాగానే ఉన్న‌ప్ప‌టికీ.. గ‌త ఎనిమిది నెల‌లుగా ఆమెకు గుండె నొప్పి వ‌స్తోంది. దీనికి చికిత్స కోసం దేశంలోనే ప్ర‌ముఖ వైద్యుల‌ను ఆమె సంప్ర‌దించినా ఎలాంటి ఫ‌లితం లేక‌పోయింది. దీంతో.. ఆమెకు అరుదైన శ‌స్త్ర చికిత్స చేయాల‌ని చెన్నైలోని ప్రంటియ‌ర్ ఆసుప‌త్రి వైద్యులు నిర్ణ‌యించారు.

అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన ఈ ఆప‌రేష‌న్ ను స‌ద‌రు ఆసుప‌త్రి వైద్యులు విజ‌య‌వంతంగా పూర్తి చేశారు. ఆమె గుండె వాల్వ్ పూర్తిగా దెబ్బ తిన‌టంతో ఈ త‌ర‌హా చికిత్స అవ‌స‌ర‌మైంద‌ని చెబుతున్నారు. మొత్త‌మ్మీదా ఫ్రంటియ‌ర్ ఆసుప‌త్రి వైద్యులు.. వృద్ధురాలి గుండెను విజ‌య‌వంతంగా అమ‌ర్చారు. అత్యంత క్లిష్ట‌మైన శ‌స్త్ర చికిత్స‌ల్ని చేయ‌గ‌ల సామ‌ర్థ్యం మ‌న‌కుంద‌ని వీరు నిరూపించారు.