మేకప్ కోసం 6 నెలల్లో 5 వేల కోట్లు... భారతీయ మహిళల రికార్డ్!
ఈ క్రమంలో ఊహించని స్థాయిలో ఈ వ్యాపారం భారతదేశంలో జరుగుతుందని తాజా ఘణాంకాలు కీలక విషయాలు వెల్లడించాయి
By: Tupaki Desk | 2 Aug 2023 12:30 PM GMTఒకప్పుడు మేకప్ అనే మాటలు ఎక్కువగా కళాకారుల విషయాల్లోనే వినిపించేవి. అనంతరం మెట్రోపాలిటన్ సిటీలలో కనిపించాయి. ప్రస్తుతం రోజుల్లో ఎక్కడ బడితే అక్కడ దర్శనమిస్తున్న సంగతి తెలిసిందే! ఆఫీసులకు వెళ్లే మహిళల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతుండటం కూడా ఇందుకు ఒక కారణం అంటున్నారు.
ఈ క్రమంలో ఊహించని స్థాయిలో ఈ వ్యాపారం భారతదేశంలో జరుగుతుందని తాజా ఘణాంకాలు కీలక విషయాలు వెల్లడించాయి. నివేధికల ప్రకారం... గత 6 నెలల కాలంలో భారత్ లోని 10 నగరాల్లోనే 100 మిలియన్లకుపైగా లిప్ స్టిక్, నెయిల్ పాలిష్, ఐలైనర్స్ వంటివి కొనుగోలు చేశారని తెలుస్తోంది.
ఈ ఒక్క లెక్క చాలు.. భారత్ వంటి అత్యధిక జనాభా కలిగిన దేశంలో కాస్మొటిక్స్ వ్యాపారం ఏ స్థాయిలో నడుస్తుందో చెప్పడానికి. మూడు పువ్వులూ ఆరు కాయలూ అనేది చిన్న విషయమైపోద్దన్నా అతిశయోక్తి కాదేమో. బ్యూటీ ఉత్పత్తుల కోసం ఏకంగా ఈ ఆరు నెలల్లో రూ. 5 వేల కోట్లు ఖర్చు చేశారు భారతీయులు!
అయితే వీటిలో సుమారు 40 శాతం మేర ఆన్ లైన్ ద్వారా కొనుగోలు చేసినట్లు కాంతర్ వరల్డ్ ప్యానల్ ఓ నివేదిక విడుదల చేసింది. ఈ నివేదికల ప్రకారం భారతీయులు సగటున ఒక్కొక్కరు ఈ ఆరు నెలల్లో 1,214 రూపాయలు కాస్మెటిక్స్ కోసం ఖర్చు చేశారు. వీటిలో లిప్ స్టిక్ సేల్స్ అగ్రస్థానంలో ఉన్నాయి.
ఇలా అత్యధికంగా కొనుగోలు చేస్తున్న బ్యూటీ ప్రోడక్ట్స్ లో 38 శాతం పెదాలు అందంగా కనిపించేందుకు వినియోగించే వాటిని కొనుగోలు చేయగా.. ఆ తర్వాత స్థానంలో నెయిల్ ఉత్పత్తులు ఉన్నాయి. వీటిలో కాస్త వయసు ఎక్కువగా ఉన్నవారు లిప్ స్టిక్, నెయిల్ పాలిష్ కోసం చూస్తుంటే.. యుక్త వయసు వారు ప్రీమియర్ లిప్ బామ్ కొనుగోలు చేస్తున్నట్లు తెలిపింది.
ఇదే క్రమంలో షాపర్స్ స్టాప్ రిపోర్ట్ ప్రకారం.. గత మూడు నెల్లలోనే తమ సేల్స్ లో 1,50,000 మేకప్ కిట్స్ విక్రయాలు జరిగిందట. వీటిలో మూడు వంతుల సేల్స్ రిటైల్ మార్కెట్ ద్వారానే జరుగుతన్నట్లు షాపర్స్ స్టాప్ నివేధిక తెలిపింది.
దీంతో భారతీయుల్లో అందం కోసం ఆరాటపడుతున్న తీరును ఈ గణాంకాలు తెలియజేస్తోన్నాయని అంటున్నారు నిపుణులు. అలాగే కాస్మెటిక్ మార్కెట్లో ప్రధానంగా వర్కింగ్ వుమెన్ పాత్ర ఎక్కువగా ఉందని, వారే ఎక్కువగా సౌంధర్య సాధనాలను కొనుగోలు చేస్తున్నట్లు తేలిందని అంటున్నారని తెలుస్తోంది.