Begin typing your search above and press return to search.

భారతదేశంలో అత్యంత ధనవంతులైన ఎమ్మెల్యేలు వీరే!

అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్

By:  Tupaki Desk   |   20 July 2023 5:16 AM GMT
భారతదేశంలో అత్యంత ధనవంతులైన ఎమ్మెల్యేలు వీరే!
X

భారతదేశంలో అత్యంత ధనవంతుడైన ఎమ్మెల్యే ఎవరు.. అత్యంత పూర్ ఎమ్మెల్యే ఎవరు.. ఈ లిస్ట్ లో టాప్ లో నేతలు ఎంతమంది.. వారంతా ఏ పార్టీకి, ఏ రాష్ట్రానికి చెందినవారు అనే వివరాలు తాజాగా తెరపైకి వచ్చాయి.

అవును... అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్, నేషనల్ ఎలక్షన్ వాచ్ విడుదల చేసిన తాజా నివేదికల్లో... భారతదేశంలోని రిచ్చెస్ట్ అండ్ పూరెస్ట్ ఎమ్మెల్యే ఎవరనే విషయాలు వెల్లడయ్యాయి. ఇదే సమయంలో ఏ పార్టీ నుంచి ఎంతమంది బిలియనీర్లు ఉన్నారు, వారి ఆస్తులు ఎంత అనే విషయాలు వెల్లడయ్యాయి.

ఇందులో భాగంగా... కాంగ్రెస్ పార్టీ నుండి 19 మంది బిలియనీర్లు ఉండగా.. బిజెపి నుండి 9 మంది, జెడిఎస్ ఇద్దరు, కె.ఆర్.పి.పి. నుండి ఒకరు, స్వతంత్ర అభ్యర్థి ఒకరు అసెంబ్లీకి ఎన్నికయ్యారని తెలుస్తుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే... భారతదేశంలోని అత్యంత ధనవంతులైన ఎమ్మెల్యేలలో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నది కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్.

కర్ణాటక ఉపముఖ్యమంత్రి, కెపీసీసీ చీఫ్ డీకే శివకుమార్... 265 కోట్ల అప్పులతో రూ.1,413 కోట్ల ఆస్తులను కలిగి ఉన్నారని నివేదిక చెబుతుంది. వీటిలో మొత్తం స్థిరాస్తుల విలువ రూ.273 కోట్లు కాగా.. చరాస్తులు రూ.1,140 కోట్లు. ఫలితంగా... దేశంలోనే అత్యంత ధనిక ఎమ్మెల్యేగా శివకుమార్ రికార్డులకెక్కారు.

ఇదే సమయంలో దేశంలో రెండవ అత్యంత సంపన్న ఎమ్మెల్యే ఏ పార్టీకి చెందిన వారు కాకపోవడం గమనార్హం. ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అయిన గౌరీబీదనూరు నియోజకవర్గం నుంచి గెలిచిన ప్రముఖ వ్యాపారవేత్త కేహెచ్ పుట్టస్వామి గౌడ్ సెకండ్ రిచ్చెస్ట్ ఎమ్మెల్యేగా నిలిచారు. ఈయన ఆస్తుల విలువ రూ. 1,267 కోట్లు కాగా.. అప్పులు రూ.5 కోట్లు!

శివకుమార్, గౌడల తర్వాత మూడో ధనిక ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ యువ శాసనసభ్యుడు ప్రియాకృష్ణ 39 ఏళ్ల వయసులో రూ.1,156 కోట్ల ఆస్తులను ప్రకటించారు. వీటిలో 990 కోట్ల స్థిరాస్తులు, రూ.276 కోట్ల చరాస్తులతో పాటు తనపై ఆధారపడిన వారి పేరిట 1.6 కిలోల బంగారం, 5 కిలోల వెండి ఉన్నాయట.

ఇదే సమయంలో సుమ్నారు రూ.881 కోట్ల అప్పులు కూడా ప్రియాకృష్ణ పేరున ఉన్నాయట. దేశవ్యాప్తంగా ఉన్న శాసనసభ్యులలో అత్యధిక అప్పులు కలిగి ఉన్న వ్యక్తిగా కూడా ప్రియాకృష్ణ రికార్డు సృష్టించారని తెలుస్తుంది. అతని తండ్రి, ఎం. కృష్ణప్ప కూడా కర్ణాటకలోని టాప్ బిలియనీర్ల జాబితాలో 18వ స్థానంలో ఉన్నారు.

ఇతర ముఖ్యమైన పేర్లలో... గాలి జనార్ధన రెడ్డి దేశంలోని అత్యంత ధనవంతులైన ఎమ్మెల్యేల జాబితాలో చోటు సంపాదించారు. సున్నా అప్పులతో రూ. 246 కోట్ల ఆస్తులను ప్రకటించి ఆయన 23వ స్థానంలో నిలిచారు. అతని ఆస్తులలో ఎక్కువ భాగం అతని భార్య అరుణా లక్ష్మి పేరు మీద ప్రకటించడం గమనార్హం.

మొత్తంమీద.. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్, నేషనల్ ఎలక్షన్ వాచ్ ల నివేదిక ప్రకారం కర్ణాటక ఎమ్మెల్యేలలో 14 శాతం మంది అత్యంత ధనవంతులైన ఎమ్మెల్యేలు అని తేలింది.

ఆ సంగతి అలా ఉంటే... దీనికి పూర్తి విరుద్ధంగా దేశంలోనే అత్యంత పేద ఎమ్మెల్యేల లిస్ట్ కూడా తెరపైకి వచ్చింది. అందులో భాగంగా... దేశంలోనే అత్యంత పేద ఎమ్మెల్యే గా పశ్చిమ బెంగాల్‌ లోని ఇండస్ నియోజకవర్గం నుండి నిర్మల్ కుమార్ ధార నిలిచారు. ఈయన ఆస్తులు రూ. 1,700 కాగా.. అప్పులు లేవు.

ఇదే సమయంలో కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికైన అత్యంత పేద ఎమ్మెల్యే బీజేపీకి చెందిన భగీరథి మురుళ్య. ఆయన ఆస్తుల విలువ రూ.28 లక్షలు, అప్పులు రూ.2 లక్షలు.

అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్, నేషనల్ ఎలక్షన్ వాచ్ సంస్థల ద్వారా 28 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాలలో 4,033 మంది ఎమ్మెల్యేల స్వీయ ప్రకటిత అఫిడవిట్‌ ల అధ్యయనం ఆధారంగా ఈ ఫలితాలు వచ్చాయని తెలుస్తుంది!

ఈ టాప్ 10 లిస్ట్ లో ఏపీ ప్రతిపక్షనేత, టీడీపీ అధినేత, కుప్పం ఎమ్మెల్యే నారా చంద్రబాబు నాయుడు టాప్ 5 లో చోటు దక్కించుకున్నారని తెలుస్తుంది. ఈ లిస్ట్ లో రూ.668 కోట్ల ఆస్తులతో టాప్ 4వ ధనవంతుడైన ఎమ్మెల్యే చంద్రబాబు కాగా.. రూ. 510 కోట్ల ఆస్తులతో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 7వ స్థానంలో ఉన్నారని తెలుస్తుంది.

ఇక ఈ నివేదికలో అత్యధిక ధనవంతులైన టాప్ 10 ఎమ్మెల్యేల లిస్ట్ ఈ కింది విధంగా ఉంది..

1. డీకే శివకుమార్ - కర్ణాటక - రూ. 1, 413 కోట్లు - కాంగ్రెస్

2. కేహెచ్. పుట్టస్వామి - కర్ణాటక - రూ. 1, 267 కోట్లు - ఇండిపెండెంట్

3. ప్రియాక్రిష్ణ - కర్ణాటక - రూ. 1, 156 కోట్లు - కాంగ్రెస్

4. నారా చంద్రబాబు నాయుడు - ఆంధ్రప్రదేశ్ - రూ. 668 కోట్లు - టీడీపీ

5. జయంతి బాయ్ - గుజరాత్ - రూ. 661 కోట్లు - బీజేపీ

6. బైరతి సురేష్ - కర్ణాటక - రూ. 648 కోట్లు - కాంగ్రెస్

7. వైఎస్. జగన్ మోహన్ రెడ్డి - ఆంధ్రప్రదేశ్ - రూ. 510 కోట్లు -వైఎస్ఆర్సీపీ

8. పరాగ్ షా - మహారాష్ట్ర - రూ. 500 కోట్లు - బీజేపీ

9. టీఎన్. బాబా - చత్తీస్ ఘడ్ - రూ. 500 కోట్లు - ఐ.ఎన్.సీ

10. మంగళ ప్రభాత్ లోథా - మహారాష్ట్ర - రూ. 441 కోట్లు - బీజేపీ