Begin typing your search above and press return to search.

నెం.3 మొదలు పెట్టాడు.. నెం.1 ఊరికే ఉంటాడా?

By:  Tupaki Desk   |   25 Dec 2020 5:56 AM GMT
నెం.3 మొదలు పెట్టాడు.. నెం.1 ఊరికే ఉంటాడా?
X
బిగ్‌ బాస్‌ సీజన్‌ 4 లో నెం.3 స్థానంలో నిలిచిన సోహెల్‌ హీరోగా ఒక సినిమాను ప్రకటించారు. జార్జి రెడ్డి నిర్మాతలు సోహెల్ తో సినిమాను నిర్మించబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన చేయడంతో పాటు ఫిబ్రవరి నుండి సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లుగా తెలియజేశారు. బిగ్‌ బాస్‌ లో నెం.3 గా నిలిచిన సోహెల్‌ అప్పుడే సినిమా మొదలు పెడితే నెం.1 గా నిలిచి విజేతగా ట్రోఫీ అందుకున్న అభిజిత్‌ ఊరికే ఉంటాడా. బిబి4 విన్నర్‌ అభిజిత్ కూడా వరుసగా సినిమాలు చేసేందుకు సిద్దం అవుతున్నాడు.

ఇప్పటికే తన వద్దకు వచ్చిన కొంత మందికి ఓకే చెప్పడంతో పాటు మరి కొందరిని లైన్‌ లో ఉంచాడట. అభిజిత్ సన్నిహితులు ఇప్పటికే కథలు వినడం వాటిని జల్లెడ పట్టి అభిజిత్‌ వద్దకు పంపించడం చేస్తున్నారట. మీడియా వర్గాల కథనం మేరకు అభిజిత్‌ ఇప్పటికే మూడు స్టోరీ లైన్‌ లకు ఓకే చెప్పాడట. వచ్చే ఏడాది బ్యాక్ టు బ్యాక్‌ ఆ సినిమాలను చేసేందుకు అభి రెడీ అవుతున్నట్లుగా సమాచారం అందుతోంది. వరుసగా సినిమాలు చేయబోతున్న అభిజిత్‌ ఈసారి సక్సెస్‌ ఫుల్‌ హీరోగా పేరు తెచ్చుకోవాలని తాపత్రయ పడుతున్నాడు. అందుకే కథల ఎంపిక విషయంలో అనుభవజ్ఞుల సలహాలు తీసుకుంటున్నాడు.

లైఫ్‌ ఈజ్‌ బ్యూటీ ఫుల్‌ సినిమాలో నటించిన అభిజిత్‌ ఆ తర్వాత పెద్దగా ఆఫర్లు దక్కించుకోలేక పోయాడు. ఆ సినిమాలో చాలా మంది హీరోలు ఉండటంతో ఈయన కనిపించలేదు. దాంతో అభికి ఆ తర్వాత ఆఫర్లు పెద్దగా రాలేదు. వెబ్‌ సిరీస్ లో నటించినా కూడా అది పెద్దగా ఇంపాక్ట్‌ చూపించలేదు. ఇప్పుడు అభి జోరు మీదున్నాడు. వచ్చే ఏడాది రెండు మూడు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తాడేమో చూడాలి. బిబి క్రేజ్ ను గత సీజన్ ల విన్నర్‌ లు వినియోగించుకోలేక పోయారు అనే విమర్శ ఉంది. అభిజిత్‌ ఆ క్రేజ్ ను పూర్తిగా వినియోగించుకుని కెరీర్‌ లో సక్సెస్‌ ను అందుకోవాలని ప్రయత్నిస్తున్నాడు.