Begin typing your search above and press return to search.
మూడు ప్రాజెక్ట్ లతో బిజీ బిజీ
By: Tupaki Desk | 3 Oct 2020 3:30 PM GMTకరోనా కారణంగా ఆరు ఏడు నెలలు షూటింగ్స్ కు గ్యాప్ రావడంతో స్టార్ హీరోల నుండి చిన్న హీరోల వరకు అంతా కూడా వచ్చే ఏడాది రెండు మూడు సినిమాలు చేయాలని పట్టుదలతో ఉన్నారు. ఈ ఏడాదిని మిస్ చేసుకున్న వారు వచ్చే ఏడాదిలో రెట్టింపు ఎంటర్ టైన్ మెంట్ ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ప్లాన్ చేస్తున్నారు. అందుకు సంబంధించి హీరోలు దాదాపు అంతా కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ లాక్ డౌన్ లో కథలు విన్న స్టార్స్ ఇప్పటికే ఓకే చేసుకున్నారు. హీరో ధనుష్ కూడా రెండు కొత్త ప్రాజెక్ట్ లకు రెడీ అయ్యాడు. ఇప్పటికే ఈయన ఒక సినిమాను చేస్తున్నాడు. మొత్తం మూడు సినిమాలను వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.
కార్తీక్ నరేన్ దర్శకత్వంలో ధనుష్ ఒక సినిమాను చేస్తున్నాడు. ఇప్పటికే సగానికి పైగా పూర్తి అయిన ఆ సినిమా షూటింగ్ ను పూర్తి చేసేందుకు ప్రారంభించాలని ఏర్పాట్లు చేస్తున్నారు. అతి త్వరలోనే షూటింగ్ ను పూర్తి చేసి తదుపరి సినిమాలకు రెడీ అయ్యి పోవాలని ధనుష్ ప్లాన్ చేస్తున్నాడు. అక్షయ్ కుమార్ మరియు సారా అలీ ఖాన్ లు నటిస్తున్న సినిమా షూటింగ్ లో కూడా త్వరలో ధనుష్ జాయిన్ కాబోతున్నాడు. ఆ సినిమా తర్వాత రామ్ కుమార్ దర్శకత్వంలో ఒక భారీ యాక్షన్ డ్రామాను కూడా ధనుష్ చేయబోతున్నాడు. ఈ మూడు సినిమాలు వచ్చే ఏడాది ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయబోతున్నాయి. మీడియం రేంజ్ బడ్జెట్ తో మూడు నాలుగు నెలల్లోనే ధనుష్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులకు ఎక్కువ సినిమాలు అందిస్తున్నాడు. వచ్చే ఏడాదిలో కూడా అదే కొనసాగబోతుంది.