Begin typing your search above and press return to search.
సీనియర్ నటుడి ఫ్యామిలీ కష్టాలు
By: Tupaki Desk | 24 Feb 2020 6:45 AM GMTబాలీవుడ్ స్టార్స్ విడాకులు తీసుకోవడం కొత్తేం కాదు. ఎంతో మంది బాలీవుడ్ స్టార్స్ విడాకులు తీసుకున్నారు కాని నటుడు రఘువీర్ యాదవ్ ది విచిత్రమైన పరిస్థితి. 62 ఏళ్ల వయసులో రఘువీర్ యాదవ్ కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి. అది కూడా ఆయన భార్య విడాకులు కోరుతున్న కారణంగా ఆయన కోర్టుకు వెళ్లాల్సి వచ్చింది. 1988లో పూర్ణిమను రఘువీర్ యాదవ్ పెళ్లి చేసుకున్నాడు. పూర్ణిమ అంతర్జాతీయ స్థాయి కథక్ డాన్సర్. ఆమెకు డాన్సర్ గా మంచి పేరు ఉంది.
పెళ్లి అయిన ఆరు ఏడు ఏళ్లు బాగానే ఉన్నారు. 1995 నుండి వీరిద్దరు దూరంగా ఉంటున్నారు. దాదాపుగా పాతిక సంవత్సరాలుగా దూరంగా ఉంటూ ఎవరికి వారు అన్నట్లుగా జీవితాన్ని సాగిస్తున్న వీరు ఇప్పుడు అధికారికంగా విడాకులకు సిద్దం అయ్యారు. వీరిద్దరికి ఒక బాబు ఉన్నాడు. ఆ బాబుకు 30 ఏళ్ల వయసు. అతడు అమ్మ వద్దే ఉంటున్నట్లుగా తెలుస్తోంది.
గత పాతికేళ్లుగా మెయింటెన్స్ కింద నెలకు 40 వేల రూపాయలను పూర్ణిమ కు రఘువీర్ ఇస్తున్నాడు. ఇప్పుడు ఆ మొత్తంను లక్ష రూపాయలకు పెంచాలని ఆమె కోరిక. కాని రఘువీర్ మాత్రం అందుకు ఒప్పుకోలేదు. దాంతో కోర్టుకు వెళ్లి విడాకులు తీసుకుని పది కోట్ల భరణం పొందాలని పూర్ణిమ భావిస్తుంది. కోర్టులో విడాకులకు దరకాస్తు చేసుకున్న పూర్ణిమ తనకు పది కోట్ల భరణం ఇప్పించాల్సిందిగా పిటీషన్ లో కోరింది. ఈ విషయమై రఘువీర్ ను సంప్రదించేందుకు ప్రయత్నించగా ఆయన మాట్లాడలేదు. న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉంది. తుది తీర్పును బట్టి తాను నడుచుకుంటాను అన్నాడు.
ముంగేరిలాల్ కే హసీన్ సప్నే సీరియల్ తో ఒక్కసారిగా ఫేమస్ అయ్యి లగాన్ చిత్రంతో వెండి తెరపై స్టార్ గా రఘువీర్ యాదవ్ గుర్తింపు దక్కించుకున్నారు. ఆ తర్వాత పలు సినిమాల్లో మరియు సీరియల్స్ లో నటించిన రఘువీర్ ఈమద్య కాలంలో కాస్త నటనకు దూరంగా ఉంటున్నారు. ఆరు పదుల వయసు దాటిన వయసులో ఫ్యామిలీ గొడవలతో కోర్టుకు వెళ్లడం కాస్త బాధాకరమే.