Begin typing your search above and press return to search.
కెరీర్ బండి సెకండ్ గేర్ లోనే
By: Tupaki Desk | 24 Nov 2019 4:51 AM GMTటాలీవుడ్ లో ద్వితీయ శ్రేణి హీరోల సంఖ్య చాలా ఎక్కువే వుంది. అసాధారణ స్టార్ డమ్ అందుకోలేక .. మార్కెట్ స్థాయిని పెంచుకోలేక సతమతమయ్యే జాబితాలో అరడజను పైగా హీరోలు ఉన్నాయి. వివిధ చిత్రాల్లో సెకండ్ హీరో.. నెగటివ్ హీరో తరహా పాత్రల్లో నటించి గత కొంత కాలంగా ఆకట్టుకుంటున్న చాలా మంది టాప్ గేర్ వేయడానికి ఎదురుచూస్తున్నారు. అలాంటి హీరోల జాబితా తిరగేస్తే..
ద్వితీయ శ్రేణికే పరిమితమైన హీరోల్లో ముందు వరుసలో నిలిచిన హీరో నితిన్. త్రివిక్రమ్ `అఆ` లాంటి సినిమాతో నితిన్ ని 50 కోట్ల క్లబ్ లో చేర్చినా ఆ తర్వాత మళ్లీ అదే స్థాయి మార్కెట్ ని మాత్రం నిలబెట్టుకోలేకపోయాడు. నితిన్ ఇప్పటికీ ఇంకా ద్వితీయ శ్రేణిలోనే వుండిపోయాడు. నాగశౌర్య పరిస్థితి కూడా అంతే.. `ఛలో`తో బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకున్నా ఆ తరువాత చేసిన సినిమాతో మళ్లీ మొదటికొచ్చాడు. నిఖిల్ పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. శ్రీ విష్ణు కూడా పడి లేస్తూనే వున్నాడు. సత్యదేవ్ మంచి బేస్ వాయిస్ వున్నా ఆకట్టుకోలేక తనకు దక్కింది చేసుకుంటూ పోతున్నాడే కానీ నెక్ట్ లెవెల్ కి మాత్రం వెళ్లలేకపోతున్నాడు. సందీప్ మాధవ్ (సాండీ) అడపాదడపా సినిమాలు చేస్తూ స్పీడ్ పెంచుకునే పనిలో ఉన్నాడు. సాయికుమార్ వారసుడు ఆది సైతం కెరీర్ ని నెక్ట్స్ లెవల్ కి తీసుకెళ్లాలని తపించినా ఆశించినది దక్కడం లేదు. తనీష్- వరుణ్ సందేశ్ ఇటీవల కెరీర్ ని రీబూట్ చేసుకునేందుకు నానా ప్రయాసలు పడుతున్నారు.
`లక్ష్మీస్ ఎన్టీఆర్`లో చంద్రబాబు నాయుడు పాత్రలో నటించిన శ్రీతేజ్ కూడా హీరోగా ద్వితీయ శ్రేణిలోనే వుండిపోయాడు. వీళ్లంతా టాప్ గేర్ వేసేదెప్పుడు టాప్ రేంజ్ లోకి వచ్చేదెప్పుడన్నది మాత్రం కాలమే నిర్ణయించాలి. ఇలా హీరోలుగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్న పలువురు హీరోలు ఉన్నారు. పలువురు నవతరం హీరోలు స్టార్లు గా ఎదిగేందుకు హార్డ్ వర్క్ చేస్తున్నారు.