Begin typing your search above and press return to search.
తనపై చేతబడి చేశారంటున్న నటుడు
By: Tupaki Desk | 20 Aug 2021 1:03 PM ISTమనిషి ఆకాశంలోకి వెళ్లి తిరిగి వస్తున్న ఈరోజుల్లో కూడా ఇంకా మంత్రాలు, తంత్రాలు.. ఆ మంత్రాలకు చింతకాయలు రాలుతాయా? అన్నది నిజంగా ఆలోచించాల్సిన విషయమే. టెక్నాలజీ పెరుగుతున్న ఈరోజుల్లో కూడా చేతబడి, బాణామతి ఉన్నాయంటే నవ్వేస్తారు జనాలు. కానీ కొందరు మాత్రం ఆ పరిస్థితులను ఎదుర్కొని బయటపడి ఇప్పుడు ఏది నిజమో అర్థం కాక కన్ఫ్యూజన్ లో ఉంటున్నారు.
తాజాగా విలన్ గా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వందలాది చిత్రాల్లో నటించిన టార్జన్ తన జీవితంలో ఎదురైన భయంకర పరిస్థితుల గురించి చెప్పుకొచ్చి షాక్ ఇచ్చారు. టార్జాన్ అలియాస్ ఎదిరే లక్ష్మీనారాయణ గుప్తా.. రాంగోపాల్ వర్మ ‘గాయం’ చిత్రంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. శివ, క్షణక్షణం వంటి చిత్రాల్లో నటుడిగా నిరూపించుకొని సుమారు 30 ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.
తాజాగా ఓ య్యూట్యూబ్ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నటుడు టార్జన్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. మీరు చెబితే నమ్మరు కానీ.. 13 ఏళ్ల పాటు చేతబడి వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నాం.. మా ఇంట్లో అమ్మ, నాన్న, అన్నయ్య, నాకు అందరికీ చేతబడి చేశారు. అన్నయ్య అన్నం తింటే వాంతులు అయిపోయేవి. ఊరు పొలిమేర దాటితే ఏం ఉండేది కాదు.. కానీ సరిహద్దుల్లోకి వచ్చి ఊరులోకి వస్తే నీళ్లు తాగినా బయటకు వచ్చేసేవి. నాకు కడుపునొప్పి వచ్చేది.. వారెవరో మాకు తెలుసు.. కేసులు కూడా పెట్టాం.. చివరకు అన్నీ ఆస్తులు అమ్ముకొని హైదరాబాద్ కు వచ్చేశాం.. ఇటీవలే నా భార్య చనిపోవడంతో రెండుమూడేళ్లుగా పూర్తిగా దేవుడి స్మరణలోనే బతుకుతున్నా ’అ ంటూ నటుడు టార్గన్ తనకు ఎదురైన అనుభవాలను పంచుకున్నాడు.
చేతబడులు, బాణామతిని తాము నమ్ముతామని.. పౌర్ణమి, అమావాస్యలను నమ్మినప్పుడు వీటిని కూడా నమ్మాలని సూచించారు. మంత్రాలు, తంత్రాలు ఉన్నాయని.. ఎవరూ నమ్మురని తెలుసు.. కానీ మేం అనుభవించాం అంటూ నటుడు టార్జన్ సంచలన విషయాలు పంచుకున్నారు.