Begin typing your search above and press return to search.

పట్టించుకోండి ప్లీజ్.. కరోనాతో నటి శివపార్వతి అతలాకుతలం

By:  Tupaki Desk   |   19 Aug 2020 6:15 AM GMT
పట్టించుకోండి ప్లీజ్.. కరోనాతో నటి శివపార్వతి అతలాకుతలం
X
కరోనా ధాటికి అందరూ బలవుతున్నారు. వైరస్ తో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. కరోనాకు కాదు ఎవరు అనర్హం అన్నట్టుగా పరిస్థితి ఉంది. దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్రత బాగా పెరుగుతోంది. దీనికి సినిమా, సీరియల్ సెలెబ్రెటీలు అందరూ వరుసగా కరోనా బారినపడుతున్నారు.

మంగళవారం ఇద్దరు టాలీవుడ్ సింగర్లు సునీత, మాళవికలు కరోనా బారినపడ్డారు. తాజాగా మరో ప్రముఖ నటి శివపార్వతికి కూడా కరోనా సోకింది. అయితే కరోనాతో తాను తీవ్ర ఇబ్బందులు పడుతున్నానని పట్టించుకోండి ప్లీజ్ అంటూ ఆమె వీడియోలో వేడుకోవడం అందరినీ కలిచివేస్తోంది.

పలు తెలుగు చిత్రాలు, సీరియల్స్ లో శివపార్వతి నటించారు. ప్రస్తుతం ఈమె ‘వదినమ్మ’ సీరియల్ లో నటిస్తున్నారు. తనకు కరోనా సోకినా ఎవరూ పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

నటీనటులకు ఇన్సూరెన్స్ చేయించారనే మాట ఎంత వరకు నిజం అని వీడియోలో ప్రశ్నించారు శివపార్వతి. అది తనకు వర్తిస్తుందా? అని ఆమె ప్రశ్నించింది. వదినమ్మ సీరియల్ ప్రొడ్యూసర్ ప్రభాకర్ సైతం తనను పట్టించుకోవడం లేదని.. ఒక్క జీవిత రాజశేఖర్ లు మాత్రమే సాయం చేశారని వెల్లడించారు.