Begin typing your search above and press return to search.

ఆ బోల్డ్‌ సీన్స్‌ నేను చేయలేదు, పాత్ర తీరు అది

By:  Tupaki Desk   |   30 Nov 2020 9:10 AM GMT
ఆ బోల్డ్‌ సీన్స్‌ నేను చేయలేదు, పాత్ర తీరు అది
X
బుల్లి తెర హాట్‌ బ్యూటీ విష్ణు ప్రియ 'చెక్‌ మేట్‌' సినిమా గురించి ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉంది. సినిమాలో విష్ణు ప్రియ చేసిన హాట్‌ సీన్స్‌ మరీ శృతి మించి ఉన్నాయి అంటూ కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. హీరోయిన్‌ గా అవకాశాల కోసం మరీ ఇంతగా బోల్డ్‌ గా నటించాలా అంటూ విమర్శలు కూడా వస్తున్నాయి. అయితే తనపై కొందరు చేస్తున్న కామెంట్స్‌ కు విష్ణు ప్రియ విచిత్రంగా సమాధానం చెప్పింది. భగవద్గీత చదువుకునే 18 ఏళ్ల అమ్మాయిని అయిన నేను సడెన్‌ గా ఇలాంటి బోల్డ్‌ సీన్‌ లో నటించడం అంటే మొదట్లో కష్టంగానే అనిపించింది. కాని కథ డిమాండ్‌ మేరకు ఇలాంటివి కొన్ని సార్లు తప్పవు కదా అనుకుని నటించాను అంది.

ఇలాంటి బోల్డ్‌ సీన్స్‌ లో నటించాల్సి వచ్చినప్పుడు ట్రోల్స్‌ గురించి ముందే ఆలోచించాను. కాని ఆ సమయంలో నాకు ఆ బోల్డ్‌ సీన్‌ నేను కాదు ఆ సినిమాలోని పాత్ర చేస్తుంది. నేను ఎందుకు అంతగా ఫీల్‌ అవ్వాలి అనిపించింది. సినిమాలోని ఆ బోల్డ్‌ సీన్స్‌ ను దర్శకుడు చాలా కంఫర్ట్‌ బుల్‌ గా తెరకెక్కించాడు. నాకు ఎక్కడ కూడా ఇబ్బంది కలుగకుండా మరీ అశ్లీలంగా కనిపించకుండా దర్శకుడు తెరకెక్కించాడు. కనుక నేను బోల్డ్‌ సీన్‌ ల్లో నటించే సమయంలో ఇబ్బంది పడ్డ సందర్బాలు తక్కువే అంది.

ఒక పాత్రలో నటిస్తున్నప్పుడు వ్యక్తిగతంకు ఆ పాత్రకు సంబంధం ఉండదు. అలాగే సినిమాలోని ఆ బోల్డ్‌ సీన్‌ లకు నా వ్యక్తిగత జీవితానికి సంబంధం లేదు అంది. అది కేవలం సినిమా మాత్రమే కనుక ఆ బోల్డ్‌ సీన్‌ నేను చేయలేదు.. నేను ఏ పాత్రలో అయితే కనిపించానో ఆ పాత్ర చేసింది అంటూ కొత్తగా వింతగా లాజిక్‌ ను ఈ అమ్మడు తెరపైకి తీసుకు వచ్చింది. బుల్లి తెరపై అనూహ్యంగా దూసుకు వచ్చిన ఈ అమ్మడు వెండి తెరపై ఈ సినిమాతో అలరిస్తుందా అనేది చూడాలి.