Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ: ప్యారిస్ లో అంతే ప్యారిస్ లో అంతే!

By:  Tupaki Desk   |   9 Oct 2019 8:59 AM GMT
ఫోటో స్టోరీ: ప్యారిస్ లో అంతే ప్యారిస్ లో అంతే!
X
అదా శర్మను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే 'హార్ట్ ఎటాక్'.. 'S/o సత్యమూర్తి'.. 'క్షణం' లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో స్టార్ హీరోయిన్ ఇమేజ్ అయితే సాధించలేకపోయింది కానీ ప్రస్తుతం హిందీపై ఎక్కువగా ఫోకస్ చేస్తోంది. ఇక సోషల్ మీడియాను చెడుగుడు ఆడుకోవడంలో అదా స్టైలే వేరు.

ప్రస్తుతం ఈ భామ ఫ్రాన్స్ దేశంలో ఉందట. ముంబైలో ఉంటేనే వింత డ్రెస్సులతో వింత వింత హెయిర్ కలర్లతో ఫోటోలు తీసుకుని ఇన్స్టాను వేధించే ఈ భామ ఫ్రాన్స్ లో ఉంటే ఎందుకు ఊరుకుంటుంది? ఫ్రాన్స్ అనగానే మనందరికీ గుర్తొచ్చేది ప్యారిస్. సరిగ్గా అక్కడే అదా తన హంగామాను మొదలుపెట్టింది. ప్యారిస్ నగరంలోని ఒక ప్రదేశంలో ఫోటో తీయించుకుని ఆ ఫోటోలను ఇన్స్టా లో షేర్ చేసింది. ఈ ఫోటోకు "మౌలిన్ రోగ్ దగ్గర చీరతో డేట్.. మొదటిసారి" అంటూ క్యాప్షన్ ఇచ్చింది. డేట్ అనగానే తేదీ అనుకోకండి బాబులూ.. ఇది సరదాగా ఫ్రెండ్స్ తో చక్కర్లు కొట్టే డేట్. ఇక మౌలిన్ రోగ్ అనేది ప్యారిస్ లో ఒక ఫేమస్ క్యాబరే డ్యాన్స్ బార్. 'క్యాబరే' అనే పదం మీరు సరిగ్గానే విన్నారు. ఈ క్యాబరే ఇప్పటిది కాదు. 1889 లో మొదలు పెట్టారట. అంత చరిత్ర ఉంది.

అలాంటి ఫేమస్ మౌలిన్ రోగ్ కు ముందు ఒక చీర కట్టుకుని నిలుచుంది. ఇక ఆ బ్లౌజు వయ్యారం చెప్పనలవికానిది! ప్యారిస్ లో అంతే ప్యారిస్ లో అంతే.. అని మనం సరిపెట్టుకోవాలి. ఎప్పటిలాగే అందాలను వడ్డించింది. తనదైన తిక్క స్టైల్లో హెయిర్ కు నాలుగు రకాల రంగులు వేసుకుంది. చేతిలో కూలింగ్ గ్లాసెస్ తో స్టైలిష్ పోజులిచ్చింది. ఈ ఫోటోలకు రెస్పాన్స్ అదిరిపోయింది. "శారీని ఇలా కట్టాలా అదా?".. " ప్యారిస్ లో రెయిన్ బౌ చీర".. "డేట్ ఎవరితోనో చెప్పవా..?".."పర్ఫెక్ట్ షేప్..డేంజరస్ కర్వ్స్" అంటూ స్పందించారు. ఇక అదా ఫ్యూచర్ సినిమాల విషయానికి వస్తే 'మ్యాన్ టు మ్యాన్'.. 'బైపాస్ రోడ్' అనే చిత్రాల్లో నటిస్తోంది.