Begin typing your search above and press return to search.

తెలుగు నాట 'ఆహా' ప్రభంజనం మొదలైంది

By:  Tupaki Desk   |   11 Nov 2020 7:10 AM GMT
తెలుగు నాట ఆహా ప్రభంజనం మొదలైంది
X
రాబోయే రోజుల్లో ప్రేక్షకులు ఎక్కువగా డిజిటల్‌ కంటెంట్‌ పై ఆసక్తి చూపిస్తారు అంటూ గత కొంత కాలంగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే అమెరికాతో పాటు కొన్ని అభివృద్ది చెందిన దేశాల్లోని ఫిల్మ్‌ మేకర్స్‌ పూర్తిగా డిజిటల్‌ కంటెంట్ మేకింగ్‌ పై దృష్టి పెట్టారు. ఇండియాలో కూడా అదే పరిస్థితి రాబోయే అయిదు పదేళ్లలో వస్తుందంటూ అంతా భావించారు. కాని కరోనా కారణంగా థియేటర్లు మూతబడటంతో డిజిటల్‌ కంటెంట్‌ కు అనూహ్యంగా ఆధరణ పెరిగింది. అద్బుతమైన ఆధరణ దక్కడంతో ఓటీటీలు పోటీ పడి మరీ సినిమాలు కొనుగోలు చేస్తున్నాయి.

పలు ఓటీటీలు ఉన్నా కూడా అల్లు అరవింద్‌ 'ఆహా' అంటూ ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు. రాబోయే అయిదు సంవత్సరాల తర్వాత ఆహా తెలుగు రాష్ట్రాల్లో ప్రభంజనం సృష్టించడం ఖాయం అని ప్రారంభం సమయంలో భావించారు. కాని ఇప్పుడే ఆహా తెలుగు వారికి ప్రతి ఒక్కరికి దగ్గర అయ్యేలా ఉంది. పూర్తిగా తెలుగు కంటెంట్‌ ను కలిగి ఉన్న ఏకైక ఓటీటీ అవ్వడంతో తెలుగు వారి ఆధరణ దక్కించుకుంది. ఇక మొదట్లో కాస్త లో బడ్జెట్‌ అడల్ట్‌ కంటెంట్‌ ను మాత్రమే స్ట్రీమింగ్‌ చేసిన ఆహా పంథా మార్చుకుని మెల్లగా తెలుగు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నించింది.

థియేటర్లు లేని ఈ టైమ్‌ లో ఆహాకు అనూహ్యంగా ఆధరణ మొదలైంది. అయిదు సంవత్సరాల తర్వాత ఎలా అయితే ప్రభంజనం సృష్టిస్తుందని భావించారో అది ఇప్పుడే కనిపిస్తుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సమంతతో టాక్‌ షో.. తమన్నాతో వెబ్‌ సిరీస్‌ ఇంకా స్టార్‌ ఫిల్మ్‌ మేకర్స్‌ తో వెబ్‌ సిరీస్ లు మరియు చిన్న చిన్న సినిమాలు.. మంచి కంటెంట్‌ ఉన్న సినిమాలు ఆహాలో స్ట్రీమింగ్‌ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆహాతో అల్లు అరవింద్‌ ఘన విజయాన్ని సొంతం చేసుకున్నట్లే అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.