Begin typing your search above and press return to search.

ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ కి ఇప్ప‌టికి ప్ర‌శాంత‌త..!

By:  Tupaki Desk   |   29 Jan 2021 10:30 AM GMT
ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ కి ఇప్ప‌టికి ప్ర‌శాంత‌త..!
X
అక్కినేని చియాన్ అఖిల్ న‌టిస్తున్న తాజా చిత్రం `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్`. పూజా హెగ్డే క‌థానాయిక‌. బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. చివ‌రి షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ‌కు టీమ్ సిద్ధ‌మ‌వుతోంది. మ‌హ‌మ్మారీ వ‌ల్ల షూటింగ్ వాయిదా ప‌డ‌డంతో సంక్రాంతి రిలీజ్ సాధ్య‌ప‌డ‌లేదు. ఇక ఈ వేస‌విలో మూవీని రిలీజ్ చేసేందుకు చిత్ర‌బృందం ప్ర‌య‌త్నాల్లో ఉంది.

ఫిల్మ్ సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం మేరకు... అఖిల్ సినిమా కు మొగ‌లి రేకులు ద‌ర్శ‌కుడు సాగ‌ర్ రూపొందిస్తున్న షాదీ ముబార‌క్ కి మ‌ధ్య పోలిక‌లు ఉన్నాయ‌ని.. దీంతో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ ద్వితీయార్థంలో భాస్క‌ర్ మార్పులు చేస్తున్నార‌ని ర‌క‌ర‌కాలుగా ప్ర‌చార‌మ‌వుతోంది.

ఏది ఎలా ఉన్నా.. ప్ర‌స్తుతం ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ అఖిల్ మాత్రం మాల్దీవుల విహారానికి వెళ్లారు. అక్క‌డ పూర్తి రిలాక్స్ మోడ్ లో క‌నిపిస్తున్నారు. మాల్దీవుల్లో ఎకో ఫ్రెండ్లీ ల‌గ్జ‌రీ రిసార్ట్ .. `ల‌క్స్ సౌత్ అరీ అటోల్` లో అఖిల్ బ‌స చేశారు. బీచ్ వాట‌ర్స్ లో షికార్ చేస్తున్న ఓ ఫోటోని అఖిల్ షేర్ చేయ‌గా అభిమానుల్లోకి దూసుకెళుతోంది. ఇక ఈ ల‌గ్జ‌రీ రిసార్ట్ కి ఇన్ స్టా వేదిక‌గా అఖిల్ ప్ర‌చారం చేస్తుండ‌డం ఆస‌క్తిక‌రం.

సెల‌బ్రిటీ వెకేష‌న్ కి రిసార్ట్ లు ప్యాకేజీలు అందిస్తుండ‌డంతో మ‌న‌వాళ్లంతా అక్క‌డ వాలిపోతున్న సంగతి తెలిసిందే. ఇంత‌కుముందే అక్కినేని నాగ‌చైత‌న్య‌- స‌మంత జోడీ మాల్దీవుల విహారానికి వెళ్లారు. అక్క‌డి నుంచి ఫోటోలు వీడియోల్ని ఇన్ స్టాలో షేర్ చేసారు స‌మంత‌. డ‌జ‌ను పైగా అందాల క‌థానాయిక‌లు మాల్దీవుల్లో బికినీ బీచ్ సెల‌బ్రేష‌న్ తో హీటెక్కించ‌గా.. ఇప్ప‌టికీ ఈ దీవుల‌కు సెల‌బ్రిటీ తాకిడి భారీగానే ఉంది.