Begin typing your search above and press return to search.

అక్కినేని ఫ్యాన్స్ కి అఖిల్ షాకిచ్చే కొత్త‌ క‌బురు

By:  Tupaki Desk   |   9 Sep 2020 4:45 AM GMT
అక్కినేని ఫ్యాన్స్ కి అఖిల్ షాకిచ్చే కొత్త‌ క‌బురు
X
అక్కినేని చియాన్ అఖిల్ ప్ర‌స్తుతం కెరీర్ నాలుగో చిత్రంలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్` సెట్స్ పై ఉంది. జీఏ2 బ్యాన‌ర్ నిర్మిస్తోంది. ఈ సినిమా సెట్స్ లో ఉండ‌గానే అఖిల్ ప‌లువురు స్టార్ డైరెక్ట‌ర్ల‌తో త‌దుప‌రి చిత్రానికి సంబంధించి క‌థా చ‌ర్చ‌లు సాగించారు. అయితే ఇందులో ప్ర‌ధానంగా రేస్ లో ఉన్న‌ది మాత్రం సురేంద‌ర్ రెడ్డి.

కొంత‌కాలంగా సైరా డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డితో అఖిల్ సినిమా ప్లానింగులో ఉంద‌న్న ప్ర‌చారం అంత‌ర్జాలంలో వేడెక్కిస్తోంది. తాజాగా దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డింది. అఖిల్ అక్కినేని - సురేందర్ రెడ్డి - అనిల్ సుంకర ల కాంబినేషన్ లో క్రేజీ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ల‌నుంది.

చిరంజీవి టైటిల్ పాత్ర‌లో `సైరా: నరసింహా రెడ్డి` లాంటి భారీ కాన్వాస్ ఉన్న చిత్రాన్ని అద్భుతంగా తెర‌కెక్కించార‌న్న పేరు సురేంద‌ర్ రెడ్డికి వ‌చ్చింది. అంత‌కుముందు రేసు గుర్రం- ధృవ‌ లాంటి క‌మ‌ర్షియ‌ల్ బ్లాక్ బ‌స్ట‌ర్ల‌ను తెర‌కెక్కించారు. అందుకే సురేంద‌ర్ రెడ్డి కాంబినేష‌న్ లో అఖిల్ ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ హీరోగా ఎలివేట్ చేసే ప్ర‌య‌త్న‌మిద‌ని చెప్ప‌వచ్చు.

ఇక అఖిల్ కి స‌రైన టైమ్ లో స‌రైన హిట్టు కావాలి. భాస్క‌ర్ ఆ విజ‌యాన్ని అందిస్తాడ‌నే ఆశిస్తున్నారు అభిమానులు. ఆ త‌ర్వాత సురేంద‌ర్ రెడ్డి లాంటి క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్ టైన‌ర్ స్పెష‌లిస్టుతో సినిమా అంటే అత‌డికి ప్ల‌స్ అవుతుంద‌నే భావించాలి. అనీల్ సుంక‌ర‌తో క‌లిసి సురేంద‌ర్2 సినిమా బ్యానర్ పై సురేందర్ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. అఖిల్ 5 నటీనటులు సాంకేతిక నిపుణులు స‌హా ఇత‌ర‌ వివరాలు త్వరలో ప్రకటించనున్నారు.