Begin typing your search above and press return to search.

రిబ్బ‌న్లు చుట్టుకొచ్చి ఏమిటా ఫోజు?

By:  Tupaki Desk   |   16 Feb 2020 1:27 PM GMT
రిబ్బ‌న్లు చుట్టుకొచ్చి ఏమిటా ఫోజు?
X
ఫిలింఫేర్ అవార్డ్స్ 2020లో ఆలియా మిరుమిట్ల‌ గురించి ఏమ‌ని చెప్పాలి? రాజీ - ఉడ్తా పంజాబ్ తర్వాత `గల్లీ బాయ్`లో న‌ట‌న‌కు ఉత్తమ నటిగా మ‌రోసారి అవార్డును కొల్ల‌గొట్టింది. ఇక ఈ వేదిక‌పై భామ‌లు ఎంద‌రు ఉన్నా.. ఆలియా లుక్ సెంటరాఫ్ ఎట్రాక్ష‌న్ గా నిలిచింది. పసుపు - పింక్ కాంబినేష‌న్ డిజైన‌ర్ డ్రెస్ లో ఆలియా మెరుపులు మెరిపించింది. కేవ‌లం న‌ట‌న‌లోనే కాదు.. ఫ్యాష‌న్ అండ్ స్టైల్ కంటెంట్ లో త‌న‌ని కొట్టేవాళ్లు లేర‌ని ప్రూవ్ చేసింది మ‌రోసారి.

కరణ్ జోహార్ `స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్` (2012) చిత్రంతో తెరంగేట్రం చేసిన అలియా భట్ స‌మ‌కాలీన న‌టీమ‌ణుల్లో అత్యుత్తమ నటీమణులలో ఒక‌రిగా నిరూపించుకుంది. ఆలియా హార్డ్ వ‌ర్క్ ..అంకితభావం పరిశ్రమ వ‌ర్గాల‌తో పాటు ప్రేక్షకుల్లోనూ ప్రశంసలు అందుకుంది.

2018లో విక్కీ కౌషల్ స‌ర‌స‌న‌ నటించిన `రాజీ` బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యం సాధించింది. ఈ చిత్రంలో ఆలియా న‌ట‌న‌కు ఉత్త‌మ‌న‌టిగా ఫిలింఫేర్ గెలుచుకుంది. రాజీ త‌న కెరీర్ కి కీల‌క మ‌లుపు. కెరీర్ సంగ‌తిని ప‌రిశీలిస్తే..2020 మోస్ట్ అవైటెడ్ మూవీ ఆర్.ఆర్.ఆర్ లో చ‌ర‌ణ్ స‌ర‌స‌న న‌టిస్తోంది. అలాగే అయాన్ ముఖర్జీ `బ్రహ్మాస్త్రా`లో రణబీర్ కపూర్- అమితాబ్ బచ్చన్- మౌని రాయ్ - అక్కినేని నాగార్జున వంటి అగ్ర‌తారాగ‌ణంతో క‌లిసి న‌టిస్తోంది. ఈ చిత్రం 2020 డిసెంబర్ 4 న థియేటర్లలోకి రానుంది. మహేష్ భట్ తెర‌కెక్కిస్తున్న `సడక్ 2` లో ఆదిత్య రాయ్ కపూర్- పూజా భట్ -సంజయ్ దత్ లతో క‌లిసి న‌టిస్తోంది. క‌ర‌ణ్ జోహార్ త‌క్త్ లోనూ కీల‌క పాత్ర‌లో న‌టిస్తోంది. ఇందులో రణవీర్ సింగ్- కరీనా కపూర్ ఖాన్- అనీల్ కపూర్- జాన్వీ కపూర్- భూమి పెడ్నేకర్ -విక్కీ కౌషల్ త‌దిత‌రులు న‌టిస్తున్నారు. సంజయ్ లీలా భన్సాలీ ద‌ర్శ‌క‌త్వంలో `గంగూబాయి కతియావాడీ`లో న‌టిస్తోంది.