Begin typing your search above and press return to search.

ఆర్య‌న్ రాజేష్ గుట్టు విప్పాడు!

By:  Tupaki Desk   |   7 Sep 2018 1:30 AM GMT
ఆర్య‌న్ రాజేష్ గుట్టు విప్పాడు!
X
స్టార్ డైరెక్ట‌ర్ ఈవీవీ పుత్ర‌ర‌త్నాలుగా ఆర్య‌న్ రాజేష్ - అల్ల‌రి న‌రేష్ ఇంచుమించు ఒకేసారి హీరోల‌య్యారు. ఇద్ద‌రూ ఒకేసారి బ‌రిలో దిగి తొలి సినిమాల‌తోనే ఆక‌ట్టుకున్నారు. న‌రేష్ .. ర‌విబాబు ద‌ర్శ‌క‌త్వంలోని `అల్ల‌రి` సినిమాతో ఆక‌ట్టుకుంటే, ఆర్య‌న్ రాజేష్ `సొంతం` సినిమాతో స్మార్ట్ హీరోగా మైమ‌రిపించాడు. రాజేష్ తొలి సినిమాతోనే రొమాంటిక్ హీరోగా మ‌గువ‌ల్లో ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఇద్ద‌రూ చెరో దారిలో ఎదిగేస్తార‌నే ఈవీవీ అనుకున్నారు. క‌ట్ చేస్తే ఊహించ‌ని షాక్‌. న‌రేష్ - రాజేష్‌ ల‌కు పెద్ద ఎదురు దెబ్బ. ఈవీవీ ఆక‌స్మిక మ‌ర‌ణం ఆ ఇద్ద‌రినీ కుంగ‌దీసింది. ఆయ‌న లేని లోటు ఆ ఇద్ద‌రికే కాదు - మొత్తం ప‌రిశ్ర‌మ‌కి కూడా క‌నిపించింది. కేవ‌లం ఈవీవీ సినిమాల‌తోనే ప‌రిశ్ర‌మలో వంద‌లాది కమెడియ‌న్లు - ఆర్టిస్టులు పొట్ట పోషించుకునేవారు. వాళ్లంతా ప‌స్తులుండాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది ఆ త‌ర్వాత‌.

ఆ క్ర‌మంలోనే నాన్న‌గారి లెగ‌సీని ముందుకు తీసుకెళ్లేందుకు ఆర్య‌న్ రాజేష్‌ - అల్ల‌రి న‌రేష్ ఇద్ద‌రూ దానిని ఓ ఛాలెంజ్‌ గా తీసుకున్నారు. కానీ ఈవీవీ క‌రిష్మాని - అనుభ‌వాన్ని అందిపుచ్చుకోలేక సొంత బ్యాన‌ర్‌ లో సినిమాలు తీసినా నెగ్గుకు రాలేక‌పోయారు. అందుకే ఆ క‌సి ఆ ఇద్ద‌రు అన్న‌ద‌మ్ముల్లో ఉందింకా. ఏనాటికైనా ప‌రిశ్ర‌మ‌పై ప‌ట్టు సాధించాల‌న్న త‌హ‌త‌హ ఉంది. అయితే అన్న‌ద‌మ్ములిద్ద‌రూ ప్ర‌స్తుతం కెరీర్ ప‌రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆర్య‌న్ రాజేష్ హీరోగా ఫెయిల‌య్యాడు. ఆ క్ర‌మంలోనే నిర్మాత‌గా సొంత బ్యాన‌ర్ స్థాపించి సినిమా తీసి క‌లిసిరాక ఇబ్బంది ప‌డ్డారు. ఆ క్ర‌మంలోనే ఆర్య‌న్ తిరిగి క్యారెక్ట‌ర్ రోల్స్ చేస్తూ తిరిగి బిగ్ ఫైట్‌ లో స‌త్తా చాటాల‌ని ప్లాన్ చేశారు. ప్ర‌స్తుతం రాజేష్ .. మెగాప‌వ‌ర్‌ స్టార్ రామ్‌ చ‌ర‌ణ్ సినిమాలో ఓ కీల‌క పాత్ర‌లో నటిస్తున్నాడు. ఇక‌పోతే టాలీవుడ్‌ లో అత్యంత వేగొంగా 50 సినిమాలు పూర్తి చేసిన అల్ల‌రి న‌రేష్ కెరీర్ ఇటీవ‌లి కాలంలో ఫ్లాపుల‌తో గాడి త‌ప్పింది. దానిని దారిలో పెట్టేందుకు చాలానే ప్ర‌యాస‌లు ప‌డుతున్నాడు.

ఓ ఇంట‌ర్వ్యూలో న‌రేష్‌ ని అన్న ఆర్య‌న్ గురించి ప్ర‌శ్నిస్తే.. ఆస‌క్తిక‌ర సంగ‌తులు చెప్పాడు. ఆర్య‌న్ ప్ర‌స్తుతం చర‌ణ్ సినిమాలో చ‌క్క‌ని పాత్ర‌లో న‌టిస్తున్నాడు. అయితే నీ రోల్ ఏంటి? అంటే అస్స‌లు చెప్ప‌డు. వాడు అస‌లు మామూలుగానే ఏదీ ఎవ‌రికీ చెప్ప‌డు. మాట్లాడ‌డు..! హీరోగా ఫెయిలైనా తిరిగి క్యారెక్ట‌ర్ న‌టుడిగా రాణించేందుకు హార్డ్ వర్క్ చేస్తున్నాడు.. అని న‌రేష్ తెలిపారు. మునుముందు బౌన్స్ బ్యాక్ అవుతాడ‌ని న‌మ్మ‌కాన్ని వ్య‌క్తం చేశారు. ఎవ్వెరి డాగ్ హాజ్ ఏ డే.. ఆరోజు అన్న‌ద‌మ్ముల‌కు తొంద‌ర్లోనే వ‌స్తుంద‌న‌డంలో సందేహం లేదు. కాస్త వెన‌క‌బ‌డొచ్చు. కానీ ప్ర‌తిభ‌ను ఎవ‌రూ ఆప‌లేరు. బ్ర‌ద‌ర్స్ పెద్ద స‌క్సెసై తిరిగి టాలీవుడ్‌ లో రాణించాల‌ని ఆకాంక్షిద్దాం. సొంత‌బ్యాన‌ర్‌ లో సినిమాలు తీసి వంద‌మంది పొట్ట పోషించుకునేలా ఈవీవీ లెగ‌సీని ముందుకు తీసుకెళ్లాల‌ని అభిమానులు కోరుకుంటున్నారు. ఆల్ ది బెస్ట్ మై డియ‌ర్‌ బ్ర‌ద‌ర్స్.