Begin typing your search above and press return to search.
సభ్య సమాజానికి నో స్మోకింగ్ సందేశం!
By: Tupaki Desk | 2 Feb 2020 3:30 AM GMTస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'అల వైకుంఠపురములో' సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. కెరీర్ బిగ్గెస్ట్ హిట్ కావడంతో అల్లు అర్జున్ చాలా సంతోషంగా ఉన్నారు. సక్సెస్ మీట్.. థ్యాంక్స్ మీట్ అంటూ తమ టీమ్ సంతోషాన్ని అందరితో పంచుకుంటున్నారు. నిన్న జరిగిన థ్యాంక్స్ మీట్ లో అల్లు అర్జున్ స్పీచ్ ఆసక్తికరంగా సాగింది.
'అల వైకుంఠపురములో' పోస్టర్లలో అల్లు అర్జున్ సూటు బూటు ధరించి బీడీ కాలుస్తున్న పోస్టర్ ఒకటి అందరికీ గుర్తే ఉంటుంది. ఇక సిత్తరాల సిరపడు సాంగ్ లో బన్నీ స్మోకింగ్ చేస్తూ కనిపిస్తాడు. ఈ స్మోకింగ్ సీన్స్ గురించి బన్నీ మాట్లాడుతూ "ఒక చిన్న డిస్ క్లెయిమర్ మాత్రం చెప్పాలని అనుకున్నాను. ధూమపానం ఆరోగ్యానికి హానికరం. సిత్తరాల సిరపడు పాటలో నేను సిగరెట్ తాగుతాను. అయితే అది సినిమాలో ఆ పాత్రకు సంబంధించినది మాత్రమే. రియల్ లైఫ్ లో నేను స్మోక్ చెయ్యను. ఈ సందర్భంగా నేను అందరూ పిల్లలకు చెప్పదలుచుకున్నది ఏంటంటే స్మోకింగ్ ఆరోగ్యకరం కాదు. పిల్లలకే కాదు పెద్దవారికి కూడా నేను అదే చెప్తాను. ప్లీజ్ ఎవరూ స్మోక్ చెయ్యవద్దు. అది మంచి సైన్ కాదు" అన్నారు. దీనర్థం సినిమాలో తన తన స్మోకింగ్ సీన్లు చూసి ఎవరూ బీడీలు.. చుట్టలు.. సిగరెట్లు గట్రా ఎగబడి కొని అదేపనిగా కాల్చొద్దని సభ్యసమాజానికి నో స్మోకింగ్ సందేశం ఇచ్చారు.
ఆ ముకేష్ యాడ్.. ద్రవిడ్ రన్నౌటు.. ఊడిన దవడలు.. చిల్లులు పడిన ఊపిరితిత్తులు చూపించి స్మోకర్లకు.. నాన్ స్మోకర్లకు గంపగుత్తగా నరకం చూపించకపోతే ఇలా సాఫ్ట్ గా క్యూట్ గా స్టైలుగా స్వీటుగా బన్నీ సందేశం ప్రతి సినిమాకు ముందు చూపించొచ్చుగా. లేకపోతే ఇలాంటి సందేశం ప్రతి హీరో స్వీటుగా ఇస్తే బాగుంటుంది కానీ ప్రతి సినిమాకు ముందు ప్రేక్షకులకు రెండు నిముషాలు ఒన్స్ మోర్.. ట్వైస్ మోర్ అని మీరే చెప్పుకుని.. గరుడ పురాణం శిక్షలేస్తే ఎలా సార్లూ..????