Begin typing your search above and press return to search.

బన్నీ రికార్డ్స్ బ్రేకింగ్‌ కంటిన్యూ!

By:  Tupaki Desk   |   18 Dec 2019 4:24 PM GMT
బన్నీ రికార్డ్స్ బ్రేకింగ్‌ కంటిన్యూ!
X
అల్లు అర్జున్‌ టాలీవుడ్‌ లో యూట్యూబ్‌ రికార్డ్‌ పరంగా చూస్తే టాప్‌ ప్లేస్‌ లో ఉన్నాడు. ఈయన వరుసగా చేస్తున్న చిత్రాలు యూట్యూబ్‌ లో సెన్షేషన్‌ క్రియేట్‌ చేస్తున్నాయి. ఆమద్య ఈయన హిందీ డబ్బింగ్‌ సినిమాలో యూట్యూబ్‌ లో రికార్డు స్థాయి వ్యూస్‌ ను సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ఇప్పుడు అల వైకుంఠపురంలో సినిమా పాటలు యూట్యూబ్‌ ను షేక్‌ చేస్తున్నాయి. సామజవరగమనా మరియు రాములో రాముల పాటలు యూట్యూబ్‌ లో తక్కువ సమయంలో 100 మిలియన్‌ ల వ్యూస్‌ ను దక్కించుకున్నాయి.

అల వైకుంఠపురంలోని సామజవరగమనా మరియు రాములో రాముల పాటలు యూట్యూబ్‌ లో భారీ వ్యూస్‌ ను మరియు లైక్స్‌ ను సొంతం చేసుకుంటున్నాయి. మొదట సామజవరగమనా 100 మిలియన్‌ క్లబ్‌ లో చేరినప్పుడు అంతా అబ్బో అనుకున్నారు. కాని కొన్ని రోజుల గ్యాప్‌ లోనే ఇప్పుడు రాములో రాముల పాట కూడా 100 మిలియన్‌ ల క్లబ్‌ లో చేరింది. సామజవరగమనా పాట లైక్స్‌ పరంగా కూడా సరికొత్త రికార్డును సృష్టించింది. మిలియన్‌ లైక్స్‌ తో పాట టాలీవుడ్‌ లోనే మోస్ట్‌ లైక్డ్‌ పాటగా నిలిచింది.

యూట్యూబ్‌ లో ఇంతటి సెన్షేషన్‌ క్రియేట్‌ చేస్తున్న 'అలవైకుంఠపురంలో' సినిమాను సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. పూజా హెగ్డే హీరోయిన్‌ గా నటించగా టబు కీలక పాత్రలో నటించింది. ఈ చిత్రంలో బన్నీ లుక్‌ మరియు బాడీ లాంగ్వేజ్‌ చాలా విభిన్నంగా ఉండటంతో పాటు థమన్‌ పాటలు ముందే హిట్‌ అవ్వడంతో సినిమా సక్సెస్‌ అవ్వడం ఖాయం అనే నమ్మకంతో మెగా ఫ్యాన్స్‌ ఉన్నారు.