Begin typing your search above and press return to search.

మాస్క్ వేసుకుని థియేట‌ర్ లో దూరిన హీరో

By:  Tupaki Desk   |   31 Jan 2020 4:28 PM GMT
మాస్క్ వేసుకుని థియేట‌ర్ లో దూరిన హీరో
X
కొంద‌రు హీరోల‌కు కొన్ని అరుదైన క్వాలిటీస్ ఉంటాయి. తాము న‌టించిన సినిమా అయినా లేదా కోస్టార్స్ న‌టించిన సినిమా అయినా జ‌నాల్లో టాక్ ఎలా ఉందో తెలుసుకోవాలంటే ఏం చేయాలి? నేరుగా జ‌నంలో క‌లిసిపోయి సీక్రెట్ గా సినిమా చూడ‌గ‌లగాలి. అప్పుడే జ‌నాల ముఖాల్లో ఫీలింగ్స్ ఏంటో రీడ్ చేసేందుకు ఆస్కారం దొరుకుతుంది.

టాలీవుడ్ స్టార్ హీరోల్లో ప‌లువురు ఈ ప‌ద్ధ‌తిని అనుస‌రిస్తుంటారు. ఇక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అయితే చెప్పాల్సిన ప‌నేలేదు. త‌న సినిమా అయినా లేదా ఇత‌ర హీరోల సినిమా అయినా జ‌నాల ఒరిజిన‌ల్ ఫీలింగ్ ఎలా ఉందో వాళ్ల ముఖాల్లో ఫీల్ ని ప‌రిశీలించేందుకు అయినా థియేట‌ర్ కి వెళ్లి సినిమా చూసొస్తుంటార‌ట‌. అయితే బ‌న్ని లాంటి క్రేజీ హీరో థియేట‌ర్ కి హంగామా గా వెళితే తెలిసిపోతుంది కాబ‌ట్టి అలా కాకుండా ఎంతో సాధాసీదాగా ఒక మామూలు కార్ లో వెళ్లి సీక్రెట్ గా చూసొస్తుంటార‌ట‌. ఆ స‌మ‌యంలో గుర్తు ప‌ట్ట‌కుడా మాస్క్ తో ఎవ‌రికీ క‌నిపించ‌కుండా థియేట‌ర్ లో కూచుని సినిమా చూస్తార‌ట‌.

త‌న‌కు ఇంట్లోనే సొంత‌ థియేట‌ర్ లో ప్రొజెక్ష‌న్ వేసుకుని చూసే అవ‌కాశం ఉన్నా.. థియేట‌ర్ కి ఎందుకు వెళ్లాలో ఇప్పుడైనా అర్థ‌మైంది క‌దా! ఈ ప‌ద్ధ‌తిని అల్లు అర‌వింద్ - దిల్ రాజు స‌హా ఇప్పుడున్న చాలా మంది అనుస‌రిస్తుంటారు. బ‌న్ని దానినే త‌న కెరీర్ ఆరంభం నుంచి అనుస‌రిస్తూనే ఉన్నాడ‌ట‌. అయితే ఈ విష‌యం బ‌య‌ట‌కు తెలిసింది చాలా త‌క్కువ మందికే. ఇటీవ‌ల సంక్రాంతి సినిమాల్ని బ‌న్ని అలానే సీక్రెట్ గా ముసుగుదొంగ‌లా థియేట‌ర్ల‌కు వెళ్లి మ‌రీ చూసొచ్చాడ‌ట‌. రైవ‌ల్ మూవీ స‌రిలేరు నీకెవ్వ‌రు చిత్రాన్ని బ‌న్ని అలానే సీక్రెట్ గా చూసాడ‌ట‌. ఇక త‌న సినిమా అల వైకుంఠ‌పుర‌ములో ని రివ్యూ చేసేందుకు ఇలానే కామ‌న్ జ‌నం మ‌ధ్య కూచుని చూసాడ‌ట‌. మొత్తానికి ఆడియెన్ పై స్ట‌డీ చేసేందుకు బ‌న్ని ఇలా థియేట‌ర్ల‌కు వెళ్ల‌డం అన్న‌ది ఆస‌క్తిక‌ర సంగ‌తే.