Begin typing your search above and press return to search.

పాల్ వినిపించే పిట్ట‌క‌థ ఏమిటో కానీ..!

By:  Tupaki Desk   |   12 Feb 2021 5:10 AM GMT
పాల్ వినిపించే పిట్ట‌క‌థ ఏమిటో కానీ..!
X
నాలుగు క‌థ‌ల సంక‌ల‌నంగా తెర‌కెక్కిన `పిట్ట క‌థ‌లు` నెట్ ఫ్లిక్స్ లో ఈ నెల 19 నుంచి స్ట్రీమింగ్ కి రెడీ అవుతున్న సంగ‌తి తెలిసిందే. న‌లుగురు ద‌ర్శ‌కులు నాలుగు క‌థ‌ల్ని తెర‌కెక్కించ‌గా అమ‌లాపాల్ న‌టించిన క‌థ ఆద్యంతం ఎమోష‌న్ తో ఘాడంగా హ‌త్తుకుకోనుంద‌న్న‌ టాక్ ఉంది.

ఎవ‌రి క‌థ‌ను వారు ప్ర‌మోట్ చేసుకోవాలి.. అందుకే అమ‌లాపాల్ ఇదిగో ఇలా సోష‌ల్ మీడియాల్లో ప్ర‌మోష‌న్ ని ప‌రుగులు పెట్టిస్తున్నారు. ``స్టైల్ ఒక మార్గం.. నువ్వెవ‌రో మాట‌ల్లో చెప్పాల్సిన ప‌నే లేదు!`` అంటూ ఇలా త‌న ఫోటోషూట్ ని షేర్ చేసింది. ఈ లుక్ లో పింక్ గులాబీనే త‌ల‌పించింది పాల్! అంటూ అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.

పిట్ట క‌థ‌లు ఆంథాల‌జీ ప్ర‌మోష‌న్స్ మొద‌ల‌య్యాయి అని అమ‌లాపాల్ చెప్ప‌క‌నే చెప్పారు. ఇందులో మీరా అనే పాత్ర‌లో న‌టిస్తున్నాన‌ని వెల్ల‌డించారు. ఆమె లాంటి ప్ర‌యోగాత్మ‌క చిత్రంలో న‌గ్నంగా న‌టించి సెన్సేష‌న్స్ సృష్టించిన అమ‌లాపాల్ మ‌రోమారు గ‌ట్స్ ఉన్న పాత్ర‌లో క‌నిపిస్తున్నారు. అందుకే అభిమానుల్లో పిట్ట‌క‌థ‌లుపై ఆస‌క్తి నెల‌కొంది.

నాగ్ అశ్విన్- బి.వి.నందిని రెడ్డి- తరుణ్ భాస్కర్- సంకల్ప్ రెడ్డి ఈ చిత్రంలోని నాలుగు భాగాలకు దర్శకత్వం వహించారు. పిట్ట కథలు లోని నాలుగు కథలు నిర్దిష్ట భావాలు ఉన్న నలుగురు మహిళల గురించి ఆవిష్క‌రిస్తుంది. శ్రుతిహాసన్- మంచు లక్ష్మి- అమలాపాల్ - ఈషా రెబ్బా ఆ నాలుగు పాత్ర‌ల్లో నటించారు. అషిమా నర్వాల్- జగపతిబాబు- సత్యదేవ్- సాన్వే మేఘన- సంజిత్ హెగ్డే ఇందులో ఇత‌ర‌ కీలక పాత్రలు పోషించారు. ఆర్‌.ఎస్.‌వీ.పీ మూవీస్- ఫ్లయింగ్ యూనీకార్న్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ల పై రోనీ స్క్రూవాలా- ఆశి దువాసారా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.