Begin typing your search above and press return to search.
హీరోని `బ్రదర్` అని పిలిచేసిన అందాల నాయిక
By: Tupaki Desk | 16 July 2021 5:38 AM GMTకెరీర్ లో ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించి ప్రయోగాలతో మురిపించిన అందాల కథానాయిక అమలాపాల్. ఇటీవలే ఆమె (ఆడై) లాంటి బోల్డ్ సినిమాలో నటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ చిత్రం ఆద్యంతం అమలాపాల్ నగ్నంగా నటించి షాకిచ్చారు. ఓటీటీలో `పిట్టకథలు` సిరీస్ తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన అమలాపాల్ తాజాగా ఆహాలో ఈ నెల 16 నుండి ప్రసారం కానున్న `కుడి ఎడమైతే` అనే వెబ్ సిరీస్ లో కనిపించనున్నారు. 8 ఎపిసోడ్ల సిరీస్ కి `యుటర్న్` ఫేమ్ పవన్ కుమార్ దర్శకత్వం వహించారు.
తాజాగా `కుడి ఎడమైతే` ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో మాట్లాడుతూ.. అమలాపాల్ తన కోస్టార్ రాహుల్ విజయ్ ని బ్రదర్ అని సంభోధించడం చర్చనీయాంశమైంది. అయితే అమలాపాల్ అలా పిలవడానికి ఒక కారణం ఉంది. ఇందులో అమలాపాల్ - రాహుల్ జంటగా కనిపించరు. యాథృచ్ఛికంగా కలిసే పాత్రలు అవి.
అమలాపాల్ మాట్లాడుతూ.. ``రాహుల్ - నేను చాలా ఆసక్తికరమైన అనుబంధాన్ని కలిగి ఉన్నాం.. అది తెరపైన.. అతను నా సోదరుడు అని నేను భావిస్తున్నాను. జీవితం ప్రేమ ప్రయాణం ఆధ్యాత్మికత గురించి మాట్లాడేటప్పుడు మా మధ్య చాలా ఆసక్తికరమైన సంభాషణలు జరిగాయి`` అని తెలిపారు. మేము పోషించిన పాత్రలు స్నేహానికి మించిన సంబంధాన్ని కలిగి ఉంటాయి. నిజ జీవితంలో కూడా నేను అలా ఉండాలని భావిస్తున్నాను అని అన్నారు. ఇందులో ఆ ఇద్దరూ నాయకానాయికలు కానే కారు. కేవలం యాదృచ్ఛిక సంఘటనల తరువాత ఒకరినొకరు కలుసుకుంటారు. ఆ తర్వాత వారి మధ్య స్నేహం కొనసాగుతుందన్నమాట!