Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ: ఫైటర్ భామ సంప్రదాయం ఇలా ఉంది

By:  Tupaki Desk   |   11 April 2020 11:30 PM GMT
ఫోటో స్టోరీ: ఫైటర్ భామ సంప్రదాయం ఇలా ఉంది
X
అదేంటో కానీ స్టార్ కిడ్స్ అంటే ఎక్కువ మందికి తక్కువ అభిప్రాయం ఉంది. కానీ పెద్ద స్టార్ కిడ్ అయినా హార్డ్ వర్క్ చేయకపోతే నాలుగైదు సినిమాలకి తిరుగు టపా కట్టాల్సి ఉంటుంది. బాలీవుడ్ విషయమే తీసుకుంటే స్టార్ కిడ్స్ హవా ఎక్కువే. హీరోలతో పాటు హీరోయిన్లు కూడా ఎంతోమంది బాలీవుడ్ ఎంట్రీ ఇస్తూ ఉంటారు. అలా ఎంట్రీ ఇచ్చిన భామే అనన్య పాండే. చుంకీ పాండే డాటర్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ మెల్లగా బాలీవుడ్లో తన సత్తా చాటుతోంది. సోషల్ మీడియా హంగామా గురించి చెప్పనవసరమే లేదు. ఎందుకంటే ఈ తరం భామ కదా. సోషల్ మీడియాను కకావికలు చేయగల నాలెడ్జ్ అనన్య సొంతం.

ఈ భామ తరచుగా ఏదో ఒక ఫోటో పోస్ట్ చేస్తూ అభిమానులతో నిత్యం టచ్ లో ఉంటుంది. ఇన్స్టా లో 10 మిలియన్ లకు పైగా ఫాలోయర్లు ఉన్నారంటే నే మనం ఈ భామ టాలెంట్ అర్థం చేసుకోవచ్చు. ఈ భామ లాక్ డౌన్ సమయంలో కూడా ఎంతో ఉత్సాహంగా ఫోటోలు పోస్ట్ చేస్తూ సరదాగా గడుపుతోంది అభిమానులను ఉల్లాస పరుస్తోంది. అయితే ఈ ఉల్లాసంతో పాటుగా అభిమానులు కూడా కరోనా కాలం ముందు నాటి ఫోటోలను బయటకు తీసి వాటి దుమ్ముదులిపి వైరల్ చేసే ప్రయత్నంలో తెగ బిజీగా ఉన్నారు. ఎందుకంటే కొత్త ఫోటోలలో ఒకటే లొకేషన్. పెద్దగా మార్పు చేర్పులు ఉండడంలేదు. అందుకే పాత ఫోటో లకు డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది.

పైన ఉన్న ఫోటో కూడా అలాంటిదే. మెంతి రంగు ఛోళి లెహంగా ధరించి.. ఓ అందమైన దుపట్టాతో అద్భుతమైన ఎక్స్ ప్రెషన్ తో సూపర్ భంగిమ ఇచ్చింది. లైట్ గా బ్లీచ్ చేసిన జుట్టు.. చేతికి నిండా గాజులు.. సరైన మేకప్ తో కుందనపు బొమ్మలా కనిపిస్తుంది. ఇక అందాల విందు కూడా ఎటువంటి లోటు చేయలేదు. చూసుకున్న వారికి చూసుకున్నంత అన్నట్టుగా ఎంతో ఒడుపుగా బాలీవుడ్ అందాలను ఇన్స్టా విస్తరాకు పై వడ్డించింది. ఇక అనన్య ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే 'ఖాలీ పీలీ' అనే సినిమాలో నటిస్తోంది. అంతేకాకుండా విజయ్ దేవరకొండ- పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'ఫైటర్' చిత్రంలో కూడా నటిస్తోంది.