Begin typing your search above and press return to search.

మాతృత్వంపై `నువ్వు నేను` అనిత భావోద్వేగ క‌విత‌

By:  Tupaki Desk   |   27 Jan 2021 4:37 AM GMT
మాతృత్వంపై `నువ్వు నేను` అనిత భావోద్వేగ క‌విత‌
X
మాతృత్వం గొప్ప అనుభూతి. అమ్మ‌త‌నంలోని క‌మ్మ‌త‌నంపై భావోద్వేగం అంతా ఇంతా కాదు. ఇంత‌కుముందు ఎమీ జాక్స‌న్.. స‌మీరా రెడ్డి.. న‌టాషా హార్థిక్.. అనుష్క శ‌ర్మ .. త‌మ గ‌ర్భధార‌ణ స‌మ‌యంలో ఎంతో ఉద్వేగానికి లోన‌య్యారు. కొంద‌రు భామ‌లు క‌వితలు కూడా అల్లారు.

ఇప్పుడు ఉద‌య్ కిర‌ణ్ హీరోయిన్ .. `నువ్వు నేను` ఫేం అనిత హ‌స‌నందాని స‌న్నివేశం అదే. గర్భిణి అనిత హసనందాని తన ప్రసూతి ఫోటోషూట్ నుండి ఓ ఫోటోని షేర్ చేయ‌డ‌మే గాక‌.. మాతృత్వంపై అందమైన కవితను పంచుకుంది. ఈ క‌విత్వానికి సాటి స్టార్ల నుంచి అద్భుత స్పంద‌న వ‌చ్చింది.

అనితా హసానందాని తన మొదటి బిడ్డను ఎప్పుడైనా ప్రసవించే వీలుంది. ఆ క్ర‌మంలోనే ఎమోషనల్ అవుతోంది. ``చివరి త్రైమాసికంలో ఉన్నాను కాబట్టి గడువు తేదీ త్వరలో ఉంది`` అని అనిత‌ చెప్పింది. నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను.. చాలా మిశ్రమ భావోద్వేగాలను కలిగి ఉన్నాను.. కానీ నిజంగా ఉద్వేగంగా ఉన్నాను .. నా జీవితంలో కొత్త దశ కోసం ఎదురు చూస్తున్నాను. శిశువు ఆగ‌మ‌నం వ‌ర‌కూ వేచి ఉండలేను`` అంటూ ఎమోష‌న్ అయ్యింది.

అనిత ఇటీవ‌ల‌ తన బేబి బంప్ ‌తో ఫోటోలు వీడియోలను పోస్ట్ చేయ‌గా అవి వైర‌ల్ అయ్యాయి. గత నెలలో నిర్మాత ఏక్తా కపూర్ స్వ‌యంగా త‌న స్నేహితురాలు అనిత‌కు శ్రీ‌మంతం కార్య‌క్ర‌మం ద‌గ్గ‌రుండి రిపించారు. బేబీ షవర్ ‌లో గాళ్స్ గ్యాంగ్ ర‌చ్చ గురించి తెలిసిన‌దే.