Begin typing your search above and press return to search.
నాగ శౌర్య ఫ్యామిలీ నుంచి 'ఐరా సినిమాస్' అనే మరో కొత్త బ్యానర్..!
By: Tupaki Desk | 7 Nov 2020 9:50 AM GMTటాలీవుడ్ యువ హీరో నాగ శౌర్య ఫ్యామిలీ సినిమా ప్రొడక్షన్ లోకి దిగిన సంగతి తెలిసిందే. ఐరా క్రియేషన్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించి 'ఛలో' 'అశ్వథామ' వంటి సూపర్ హిట్ సినిమాలను నిర్మించారు. ఈ క్రమంలో ఇటీవలే నాగ శౌర్య హీరోగా అనీష్ కృష్ణ దర్శకత్వంలో ప్రొడక్షన్ నెం.4 చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అయితే ఇప్పుడు ఐరా క్రియేషన్స్ బ్యానర్ కి అనుబంధంగా మరో కొత్త బ్యానర్ 'ఐరా సినిమాస్' ని ఏర్పాటు చేశారు. న్యూ టాలెంటెడ్ నటీనటులు దర్శకులను ఎంకరేజ్ చేస్తూ మంచి సినిమాలు నిర్మించడమే 'ఐరా సినిమాస్' బ్యానర్ ఏర్పాటు వెనుకనున్న ముఖ్య ఉద్దేశ్యమని ప్రొడ్యూసర్స్ ప్రకటించారు. సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టాలని కలలు కనే వర్థమాన నటీనటులు దర్శకులకు ఇది గొప్ప అవకాశంగా ఉంటుందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.
'ఐరా సినిమాస్' బ్యానర్ లో మొదటి సినిమా ప్రొడక్షన్ నెం.1 ప్రారంభోత్సవం ఈ రోజు హైదరాబాద్ కార్యాలయంలో జరిగింది. ఉషా శంకర్ ప్రసాద్ మల్పూరి నిర్మించనున్న ఈ చిత్రానికి అభినవ్ సర్దార్ కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. డ్యాన్స్ మాస్టర్ సన్నీ కోమలపాటి ఈ చిత్రంతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నవంబర్ 9 నుండి ప్రారంభం కానుంది. ఇందులో నటించే నటీనటులు మరియు సాంకేతిక నిపుణుల ఇతర వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ''మంచి రోజు కావడంతో పూజా కార్యక్రమాలు ఈ రోజు జరిపించాం. 'ఐరా సినిమాస్' బ్యానర్ ఇరా క్రియేషన్స్ కు అనుబంధ సంస్థ. యంగ్ టాలెంట్ ని ప్రోత్సహించడానికి దీనిని ప్రారంభించాం. ఈ బ్యానర్ లో ఫ్రెష్ కంటెంట్ తో బ్యాక్ టు బ్యాక్ చిత్రాలను రూపొందిస్తాం. సన్నీ తో చేస్తున్న మొదటి చిత్రం థ్రిల్లర్ జోనర్ లో ఉంటుంది'' అని చెప్పుకొచ్చారు.