Begin typing your search above and press return to search.
సినిమాటిక్ కాదు.. విడదీయరాని ప్రేమానుబంధం
By: Tupaki Desk | 6 Nov 2020 7:30 AMబాలీవుడ్ అగ్ర కథానాయిక అనుష్క శర్మ .. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని పెళ్లాడి ఇప్పుడు ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల అనుష్క బేబి బంప్ ఫోటోలు అంతర్జాలాన్ని షేక్ చేశాయి. భర్తతో ప్రతి సందర్భాన్ని అనుష్క ఎంతో ఎంజాయ్ చేస్తున్న విషయాన్ని.. ప్రేమ పూర్వక సంసార జీవనాన్ని ఫోటోలు వీడియోల ద్వారా వెల్లడిస్తూనే ఉంది.
గురువారం నాడు విరాట్ కోహ్లీ తన 32 వ పుట్టినరోజును జరుపుకున్నారు. హబ్బీ కి ఈసారి అదిరిపోయే కానుకనే ఇస్తోంది అనుష్క శర్మ. అంతకుముందే ఇదిగో ఇలా ఒక ఆహ్లాదకరమైన చల్లని హగ్ తో ప్రేమానుబంధాన్ని అతడితో పంచుకుంది. విరాట్ కోహ్లీ పుట్టినరోజుకు పర్ఫెక్ట్ ఎండ్ - అనుష్క శర్మ నుండి ఒక తీయనైన ముద్దు.. అనడంలో సందేహమేం లేదు.
ఇన్ స్టాగ్రామ్ లో అనుష్క క్యాప్షన్ అవసరం లేని ఒక పోస్ట్ ను పంచుకుంది. విరాట్ కోహ్లీ పుట్టినరోజు వేడుకల నుండి రెండు ప్రియమైన క్షణాలు ఏవి అంటే.. ఒక ఫోటోలో అనుష్క విరాట్ ను ముద్దాడుతూ కనిపించగా వేరొక ఫోటోలో ఆహ్లాదకరమైన హగ్ తో కనిపించారు. ఆ ఫోటోల్లో విరాట్ చిరునవ్వు ఎంతో ప్లెజెంట్ గా ఆకట్టుకుంది.
విరాట్ ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ కోసం దుబాయ్ లో ఉన్నాడు. తన పుట్టినరోజు వేళ కొంత సమయాన్ని తన జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి కేటాయించాడు. వేడుకలు టీమ్ తో జరుపుకున్నాడు. ప్రియాంక చోప్రా.. సోనాలి బెంద్రే.. మౌని రాయ్ .. తాహిరా కశ్యప్ తదితరులు విరాట్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. టీమిండియా బృందం సమక్షంలో పుట్టినరోజును సంబరంగా జరుపుకున్న ఫోటోలు కేక్ కటింగ్ లో ఫన్ కి సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ గా మారాయి.