Begin typing your search above and press return to search.

పొడుగు అయిన సుంద‌రి బ్యాక్ సూప‌రు

By:  Tupaki Desk   |   22 Feb 2020 3:30 PM GMT
పొడుగు అయిన సుంద‌రి బ్యాక్ సూప‌రు
X
ఆర‌డుగుల అందాల‌ బుల్లెట్టు.. ప‌రిచ‌యం అవ‌స‌రం లేని బుల్లెట్టు.. స్వీటీ శెట్టి అలియాస్ అనుష్క శెట్టి. ఈ మంగుళూరు భామ అలికిడి లేక‌ అభిమానులు ఏడాది కాలంగా ఎంతో బెంగ‌పెట్టుకున్న సంగ‌తి తెలిసిందే. బాహుబ‌లి - భాగ‌మ‌తి త‌ర్వాత అనుష్క న‌టించిన సినిమా ఏదీ రాలేదు. మెగాస్టార్ పాన్ ఇండియా మూవీ `సైరా న‌ర‌సింహారెడ్డి`లో అతిధి పాత్ర‌లో త‌ళుక్కున మెరిసింది. ప్ర‌స్తుతం కోన ఫిలిం కార్పొరేష‌న్ - పీపుల్స్ మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్న నిశ్శ‌బ్ధం చిత్రంలో న‌టిస్తోంది. అయితే ఈపాటికే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా వాయిదా ప‌డిన సంగ‌తి తెలిసిందే. ఏప్రిల్ వ‌ర‌కూ వెళ్లిపోవ‌డంతో నిరాశ త‌ప్ప‌లేదు.

క‌నీసం ప్ర‌మోష‌న్ కోసం అయినా స్వీటీ గ‌డ‌ప దాటి రాక‌పోవ‌డం విస్మ‌య‌పరుస్తోంది. అయితే ఈలోగానే ఇదిగో ఇలా అదిరిపోయే ఫోటో లీకుల‌తో హాట్ టాపిక్ గా మారింది. నిశ్శ‌బ్ధం సినిమాని మెజారిటీ భాగం అమెరికాలోనే తెర‌కెక్కించారు. అక్కడ ఎగ్జోటిక్ లొకేష‌న్స్ లో మూవీని పూర్తి చేశారు. వాటిలోంచి లీకైందో ఏమో.. ఇదిగో ఈ ఫోటో చూడ‌గానే ఆర‌డుగుల అందాల బుల్లెట్టు! అంటూ ఫ్యాన్స్ ఒక‌టే ఇదైపోతున్నారు.

చీర‌లో అనుష్క అందానికి ప‌రేషాన్ అవ్వాల్సిందే. ఇటీవ‌ల స్వీటీ బ‌రువు త‌గ్గి స్లిమ్ అయ్యేందుకు చాలానే శ్ర‌మించింది. రిజ‌ల్ట్ కూడా బాగానే ఉంద‌ని ఈ ఫోటో చెప్ప‌క‌నే చెబుతోంది. అస‌లే పొడుగ‌రి అయిన అనుష్క ఇలా వెన‌క ఫీటుగా క‌నిపించేస‌రికి ఈ ఫోజు సూప‌రు! అంటూ కాంప్లిమెంట్ ఇచ్చేస్తున్నారు. ఆ పింక్ అండ్ బ్లూ శారీకి త‌గ్గ‌ట్టుగానే స్లీవ్ లెస్ టాప్ లో బ్యాక్ ఎలివేష‌న్ తో మ‌తి చెడ‌గొట్టిందంతే. అలా స్వీటీ 220 డిగ్రీల కోణంలో త‌ల‌ తిప్పి చూస్తుంటే ఫ్యాన్స్ ఒక‌టే షేక్‌..