Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ: చైతన్య రథంపై అన్నగారు

By:  Tupaki Desk   |   29 Dec 2018 4:30 AM GMT
ఫోటో స్టొరీ: చైతన్య రథంపై అన్నగారు
X
నందమూరి బాలకృష్ణ - క్రిష్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్ ఇప్పటికే ఇంట్రెస్టింగ్ ప్రోమోలతో ప్రేక్షకుల్లో ఆసక్తి రేపుతోంది. ముఖ్యంగా తెలుగువారి హృదయాల్లో చెరగని స్థానం ఏర్పరుచుకున్న స్వర్గీయ నందమూరి తారకరామారావు పాత్రలో అయన తనయుడు నందమూరి బాలకృష్ణ నటిస్తుండడం ఇందుకు ఒక కారణం. నాన్నగారి పాత్రలో పూర్తిగా లీనమైన బాలయ్య అచ్చుగుద్దినట్టుగా అన్నగారిలాగానే కనిపిస్తున్నాడు.

ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలుగా విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. మొదటి భాగం 'ఎన్టీఆర్ కథానాయకుడు' గానూ రెండో భాగం 'ఎన్టీఆర్ మహానాయకుడు'గానూ రిలీజ్ కానుంది. తాజాగా 'ఎన్టీఆర్ మహానాయకుడు' సినిమా నుండి ఒక కొత్త స్టిల్ ను రిలీజ్ చేశారు. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించిన సమయంలో చైతన్యరథం పై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతా పర్యటించిన విషయం తెలిసిందే. సరిగ్గా ఆ కాలం నాటిదే ఈ సీన్. ఈ ఫోటోలో బాలయ్య ఖాకీ దుస్తులు ధరించి చైతన్య రథంపైన నిలబడి ఉన్నాడు. కుడి చేత్తో మైకు పట్టుకున్న అయన ఎడమ చేతిని 'అన్నగారి' ట్రేడ్ మార్క్ స్టైల్ లో అలా పైకెత్తి చిరునవ్వులు చిందిస్తూ స్పీచ్ ఇస్తున్నారు.

ఎన్టీఆర్ రాజకీయ జీవితంలో అత్యున్నత విజయం పార్టీని స్థాపించిన కొద్ది నెలల్లోనే కొండ లాంటి కాంగ్రెస్ ను ఓడించి అధికారంలోకి రావడం. 'మహానాయకుడు' లో ఈ ఎపిసోడ్ కు దర్శకుడు క్రిష్ ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఉంటాడనడంలో ఏమాత్రం సందేహం లేదు. మరి మన రీల్ అన్నగారు ఏం చేశారో చూడాలంటే ఫిబ్రవరి 7 వరకూ వేచి చూడాలి.

Watch Here: పవన్ కళ్యాణ్ పావలా అయితే నీ రేటు ఎంత..?