Begin typing your search above and press return to search.

#ఎన్బీకే.. త‌న‌ని గిల్లితే కానీ ఈ లోకంలోకి రాలేర‌ట‌

By:  Tupaki Desk   |   11 Jun 2021 9:30 AM GMT
#ఎన్బీకే.. త‌న‌ని గిల్లితే కానీ ఈ లోకంలోకి రాలేర‌ట‌
X
ప‌ద్యం.. శ్లోకం .. మంత్రం వీటికి తోడు సాహిత్యం.. నేటి రోజుల్లో అతి కొద్ది మందికి మాత్ర‌మే తెలిసిన విద్య‌లు. తెలుగు- సంస్కృత భాష‌ల‌పై ప‌ట్టు ఉంటేనే వీటి జోలికి వెళ్ల‌గ‌ల‌రు. అలాంటిది న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ వేదిక‌లు ఎక్కితే ఇలాంటి వాటిని పుక్కిట పురాణం లాగా వ‌ల్లించేస్తారు. ఎన్నోసార్లు ఎన్నో వేదిక‌ల‌పై త‌నలోని సాహితీవేత్త‌ను ఆయ‌న దాచుకోకుండా బ‌హిర్గ‌తం చేశారు. తెలుగు భాష‌పై మ‌మ‌కారాన్ని ఏనాడూ దాచుకోలేదు. ఇది చాద‌స్తం అని కొంద‌రు ట్రోల్ చేసినా కానీ ఎవ‌రి ప్ర‌తిభ వారిది.

తాజాగా సాహిత్యం భాష గురించి ఓ ఇంట‌ర్వ్యూలో బాల‌కృష్ణ స‌వాల్ విసిరారు. మ‌రో రెండు తరాల వరకూ నా భాషను బతికించుకుంటాన‌ని తెలుగు పై మ‌మ‌కారం బ‌హిర్గ‌తం చేశారు. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా.. భాషని బతికించుకోవ‌డం నావల్లే అవుతుంది.. నాతోనే ఇది అంతరించుకుపోతుంది అంటూ ఎమోష‌న‌ల్ గా మాట్లాడారు. బాలకృష్ణ అంటే ఒక మీడియా అని అన్నారు.

ఆర్టిస్టు అంటే ఎలా ఉండాలి? అన్న‌దానిపైనా ప్ర‌సంగిస్తూ.. ఆర్టిస్టు అంటే న‌వ్వ‌డ‌మో ఏడ‌వ‌డ‌మో చేస్తే స‌రిపోదు. న‌ట‌న అంటే ప‌ర‌కాయ ప్రవేశం.. గిల్లితేనే నేను బాల‌య్య అని తెలిసేది. అంత‌గా ఒదిగిపోతాన‌ని అన్నారు. నువ్ ఆ పాత్రవి కాదు.. బాలక్రిష్ణవి అని తెలియడం కోసం అలా చేస్తుంటాన‌ని అన్నారు.