Begin typing your search above and press return to search.

నీతి అయోగ్ జాబితాలో బ‌స‌వ‌తార‌కం జ‌య‌హో!-NBK

By:  Tupaki Desk   |   30 Jun 2021 1:30 PM GMT
నీతి అయోగ్ జాబితాలో బ‌స‌వ‌తార‌కం జ‌య‌హో!-NBK
X
లెజెండ‌రీ న‌టుడు నంద‌మూరి తార‌క‌రామారావు స‌తీమ‌ణి కీ.శే బ‌స‌వ‌తార‌కం పేరిట హైద‌రాబాద్ బంజారాహిల్స్ లో బ‌స‌వ‌తార‌కం క్యాన్స‌ర్ ఆస్ప‌త్రిని ఏర్పాటు చేసి క్యాన్స‌ర్ రోగుల‌కు నామ‌మాత్ర‌పు ఫీజుల‌తో వైద్య సేవ‌లందిస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌యివేటు ఆస్పత్రుల‌తో పోలిస్తే ఈ సంస్థ 10-20 శాతం త‌క్కువ ఫీజు వ‌సూలు చేస్తోంది. 2000లో బ‌స‌వ‌తార‌కం ప్రారంభం ఈ 15 ఏళ్ల‌లో 165000 మంది క్యాన్స‌ర్ రోగుల‌ను ప‌రీక్షించింది.

ఈ సంద‌ర్భంగా లాభాపేక్ష లేని ఆస్ప‌త్రిగా ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఎన‌లేని గుర్తింపును ద‌క్కించుకుంది. ఇదే విష‌యాన్ని ప్ర‌స్థావిస్తూ నీతి అయోగ్ నివేదిక‌లో పుట్ట‌ప‌ర్తి వైద్యాల‌యం స‌హా బ‌స‌వ‌తార‌కం క్యాన్స‌ర్ ఆస్ప‌త్రి పేరును ప్ర‌స్థావించింది. 500ప‌డ‌క‌ల బ‌స‌వ‌తార‌కం సొంతంగానే నిధుల్ని స‌మ‌కూర్చుకుంటోంది. మూల‌ధ‌న వ్య‌యం కోసం గ్రాంట్ ల‌పై ఆధార‌ప‌డుతోంది. అయితే ఈ స‌మ‌స్య‌ను ప్ర‌భుత్వం ప‌రిష్క‌రించాల్సిందిగా నీతి అయోగ్ సూచించింది. పుట్ట‌ప‌ర్తి ట్ర‌స్ట్ ఆస్ప‌త్రులు బ‌స‌వ‌తార‌కం క్యాన్స‌ర్ ఆస్ప‌త్రికి విరాళాలు అందించే ధాత‌ల‌కు ప‌న్ను మిన‌హాయింపు 50శాతానికి ప‌రిమితం చేయ‌కుండా 100 శాతం ఇవ్వాల‌ని నీతి అయోగ్ పేర్కొంది. ఇలాంటి లాభాపేక్ష లేని ఆస్ప‌త్రుల‌కు ప్ర‌భుత్వాల‌ రీఇంబ‌ర్స్ మెంట్ వెంట‌నే ఇవ్వాల‌ని కూడా నీతి అయోగ్ ప్ర‌స్థావించింది. పేద బ‌డుగులకు నాణ్య‌మైన సేవ‌లందిస్తున్న ఆస్ప‌త్రులుగా స‌ద‌రు ఆస్ప‌త్రుల‌కు నీతి అయోగ్ స‌ర్టిఫికెట్ ఇచ్చింది.

ఈ సంద‌ర్భంగా నంద‌మూరి రామ‌కృష్ణ - బాల‌కృష్ణ సోద‌రులు `నీతి అయోగ్ జాబితాలో తాజా గుర్తింపు`న‌కు ఆనందం వ్య‌క్తం చేసారు. నంద‌మూరి సోద‌రులు మాట్లాడుతూ-``బసవతార‌కం ఇండో క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ నీతి అయోగ్ జాబితాలో చేర‌డం ప్ర‌తిష్ఠాత్మ‌క గుర్తింపు.. ఆదర్శప్రాయమైన సేవ .. దేశ ప్ర‌జ‌ల‌ ఆరోగ్య సంరక్షణకు ఆస్ప‌త్రి చేసిన కృషికి ద‌క్కిన ప్ర‌తిఫ‌ల‌మిది. దేశానికి ఆస్ప‌త్రి వ‌ర్గాలు చేసిన త్యాగం ఎంతో గొప్ప‌ది. మొత్తం ఆస్ప‌త్రి టీమ్ కు వందనాలు.. జ‌య‌హో`` అని అన్నారు. బ‌సవతారకం కుటుంబంలోని ప్రతి సభ్యునికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న మా శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు అని తెలిపారు.

భారత ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో ప్రణాళికా సంఘం స్థానంలో 2015 జనవరి 1 ఏర్పడిన సరికొత్త వ్యవస్థ నీతి ఆయోగ్.. భారత్ లోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు- గవర్నర్లు- కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు దీని పాలకమండలిలో సభ్యులుగా ఉంటారు. దీనిలో ఐదుగురు పూర్తికాల సభ్యులు.. ఇద్దరు పాక్షిక కాల సభ్యులు ఉంటారు.