Begin typing your search above and press return to search.

కోవిడ్ దెబ్బ‌కు న‌ట‌వార‌సుడి కెరీర్ రాంగ్ ట‌ర్న్!

By:  Tupaki Desk   |   26 Aug 2020 1:30 AM GMT
కోవిడ్ దెబ్బ‌కు న‌ట‌వార‌సుడి కెరీర్ రాంగ్ ట‌ర్న్!
X
సీనియ‌ర్ స‌హాయ‌న‌టుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్ టాలీవుడ్ కెరీర్ గురించి ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. పిట్ట‌క‌థ అనే సినిమాతో హీరోగా ప‌రిచ‌య‌మైన సంజ‌య్ త‌న‌ని తాను నిరూపించుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాడు. యూవీ క్రియేషన్స్ లాంటి ప్ర‌తిష్ఠాత్మ‌క బ్యాన‌ర్ లో ఓ మినీ మల్టీస్టారర్ లో నటించే అవకాశం వచ్చిన సంగ‌తి తెలిసిందే. ద‌ర్శ‌కుడు శోభ‌న్ కుమారుడు సంతోష్ తో క‌లిసి యువి బ్యాన‌ర్ లో సంజ‌య్ న‌టించ‌నున్నాడ‌ని ఇటీవ‌ల ప్ర‌చార‌మైంది. ప‌రిమిత బ‌డ్జెట్ సినిమాల‌కు బ్ర‌హ్మాజీ వార‌సుడిని ఒక ఆప్ష‌న్ గా టాలీవుడ్ నిర్మాత‌లు ఎంపిక చేసుకుంటున్నార‌ట‌.

తాజాగా మ‌రో ప‌రిమిత బ‌డ్జెట్ సినిమాలో అవ‌కాశం ద‌క్కించుకున్నాడు. అనిల్ పంగులూరి దర్శకత్వంలో రూపొందుతున్న `క్షీర సాగర మథనం`లో అత‌డు కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నాడు. మానవ సంబంధాల నేపథ్యంలో ఏడు పాత్రల‌తో ఆద్యంతం భావోద్వేగాలపై తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మ‌రో యువ‌హీరో మానస్ నాగులపల్లి తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. అక్షత సోనావని హీరోయిన్ కాగా ప్రదీప్ రుద్ర ప్రతినాయకుడిగా న‌టిస్తున్నారు. తాజాగా క్రిష్ రిలీజ్ చేసిన టీజ‌ర్ నెటిజ‌నుల్ని ఆక‌ట్టుకుంటోంది. శ్రీ వెంకటేశ పిక్చర్స్ తో కలిసి ఆర్ట్ అండ్ హార్ట్ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. క్షీర‌సాగ‌ర మ‌థ‌నం టైటిల్ కి త‌గ్గ‌ట్టే ఈ సినిమా క‌థాంశం ప్రేమ‌క‌థ హైలైట్ గా ఉంటాయ‌ని చెబుతున్నా‌రు.

ఈ మూవీతో ఇటు బ్ర‌హ్మాజీ త‌న‌యుడు సంజ‌య్.. అటు మాన‌స్ నిరూపించుకుంటార‌ని న‌మ్మ‌కంగా చెబుతున్నారు. ఇక త‌న కెరీర్ లో విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌లో న‌టిస్తూ సంజ‌య్ స‌త్తా చాటాల‌ని ఉవ్విళ్లూరుతున్నార‌ట‌. అయితే న‌ట‌వార‌సులకు కోవిడ్ వ‌ల్ల‌ రాంగ్ టైమ్ న‌డుస్తోంది. ఏదైనా సాధించాల‌న్న త‌ప‌న ఉన్నా మ‌హ‌మ్మారీ అన్నిటికీ బ్రేకులు వేసేస్తోంది. బ్ర‌హ్మాజీ న‌ట‌వార‌సుడు స‌హా శివాజీ రాజా న‌ట‌వార‌సుడు.. ప‌లువురు న‌ట‌వార‌సులు ఈ సీజ‌న్ లో అదృష్టం ప‌రీక్షించుకోవాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నా వైర‌స్ ప్ర‌తిబంధ‌కంగా మారింది.