Begin typing your search above and press return to search.

విడుదలైన రెండు వారాలకే ఓటిటిలోకి 'చేజింగ్'

By:  Tupaki Desk   |   27 April 2021 6:30 AM GMT
విడుదలైన రెండు వారాలకే ఓటిటిలోకి చేజింగ్
X
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో కోవిడ్ ఎఫెక్ట్ అనేది క్లారిటీగా కనిపిస్తుంది. ప్రతిరోజూ దేశంలో లక్షల్లో కరోనా కేసులు నమోదు అవుతుండటంతో విడుదల కావాల్సిన సినిమాలు వాయిదా పడుతున్నాయి. అలాగే ఓవైపు విడుదలైన సినిమాలకు ఆదరణ లేదు. కరోనా కారణంగా జనాలు థియేటర్లకు రావడం తగ్గిపోయింది. అందుకు నిదర్శనంగా ఇటీవలే విడుదలైన చాలా సినిమాలున్నాయి. ఇటీవలే తమిళ యాక్ట్రెస్ వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధానపాత్రలో నటించిన చేజింగ్ మూవీ ఏప్రిల్ 16న థియేట్రికల్ రిలీజ్ అయింది. కే వీరకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. కరోనా ఎఫెక్ట్ కారణంగానే ఈ సినిమాకు ఆదరణ దక్కలేదని మేకర్స్ చెబుతున్నారు.

అయితే ఈ సినిమా విడుదలైన రెండు వారాలకే ఓటిటిలో స్ట్రీమింగ్ కాబోతుంది. అంటే ఏప్రిల్ 30న సినిమాను "సింప్లీ సౌత్" అనే ఓటిటిలో స్ట్రీమింగ్ చేయనున్నారు మేకర్స్. ఈ విషయం ఖరారు చేస్తూ తాజాగా మేకర్స్ అధికారిక ప్రకటన వదిలారు. ఇదిలా ఉండగా.. వరలక్ష్మి తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితమే. ఎందుకంటే తెలుగులో క్రాక్ సినిమాతో నెగటివ్ పాత్రలో మెప్పించిన వరలక్ష్మి.. ఆ తర్వాత నాంది సినిమాలో లాయర్ పాత్రలో ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఓ వైపు మెయిన్ లీడ్ రోల్స్ చేస్తూనే మరోవైపు భారీ సినిమాలలో డిఫరెంట్ రోల్స్ చేసుకుంటూ వెళ్తోంది. ప్రస్తుతం ఆమె చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ భాషల్లో ఒక్కో సినిమా చేస్తోంది. చూడాలి మరి చేజింగ్ మూవీ ఓటిటిలో సక్సెస్ అవుతుందేమో!