Begin typing your search above and press return to search.

#ChiruBday2020 : 50 రోజుల ముందే సంద‌డి మొద‌లు

By:  Tupaki Desk   |   4 July 2021 3:52 AM GMT
#ChiruBday2020 : 50 రోజుల ముందే సంద‌డి మొద‌లు
X
ఆగ‌స్టు 22.. బిగ్ డే.. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న మెగా ఫ్యాన్స్ అంద‌రికీ చాలా ప్ర‌త్యేక‌మైన రోజు అది. తమ దైవం మెగాస్టార్ చిరంజీవి పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ప్ర‌తి సంవ‌త్స‌రం ర‌క‌ర‌కాల సేవామార్గాల‌ను అనుస‌రించి ప్ర‌జ‌ల్లోకి వెళ్ల‌డం మెగా ఫ్యాన్స్ కి అల‌వాటు. ఈసారి కూడా స‌మ‌య‌మాస‌న్న‌మైంది. స‌రిగ్గా ఇంకో 50రోజుల్లో బ‌ర్త్ డే ఉంద‌న‌గా అప్పుడే సీడీపీని ప్రారంభించి మెగాభిమానులు సోష‌ల్ మీడియాల్లో సంద‌డి చేస్తున్నారు.

మునుప‌టితో పోలిస్తే ఈసారి మెగా బ‌ర్త్ డేకి చాలా ప్ర‌త్యేక‌త ఉంది. మెగాస్టార్ కొన్ని ద‌శాబ్ధాల క్రిత‌మే బ్ల‌డ్ బ్యాంక్- ఐ బ్యాంక్ వంటివి ప్రారంభించి ప్ర‌జాసేవ‌లో ఉన్నారు. సామాజిక సేవ ఆయ‌న‌కు కొత్తేమీ కాదు. ద‌శాబ్ధాలుగా అభిమానులు ఆయ‌న‌ను అనుస‌రిస్తున్నారు. ఈసారి క‌రోనా క్రైసిస్ క‌ష్ట‌కాలంలో మెగాస్టార్ చిరంజీవి మెగా సేవ‌లు పదింత‌ల‌య్యాయి. క‌ష్టంలో నిజంగానే దేవుడ‌య్యారు. రెండు సార్లు క‌రోనా మ‌హ‌మ్మారీ త‌రుముకొస్తే ప్ర‌జ‌ల క‌ష్టాల‌ను చూడ‌లేక ఆయ‌న చేసిన సాయం అంతా ఇంతా కాదు. క‌రోనా క్రైసిస్ చారిటీని ప్రారంభించి ఆరంభం సినీకార్మికులు జ‌ర్న‌లిస్టుల కుటుంబాల‌ను స‌హా ఎంద‌రినో ఆదుకున్నారు మెగాస్టార్. క‌నీస నిత్యావ‌స‌రాల్ని నెల‌ల‌పాటు స‌రిప‌డేలా స‌ర‌ఫ‌రా చేశారు.

సెకండ్ వేవ్ స‌మ‌యంలో అంత‌కుమించి ఆయ‌న సేవ‌ల్ని విస్త‌రించారు. ఓవైపు క‌రోనా రోగులు స‌రైన స‌మ‌యంలో ఆక్సిజ‌న్ అంద‌క‌ ప్ర‌ణాలు విడుస్తుంటే చిరు -చ‌ర‌ణ్ బృందం ఆవేద‌న చెందారు. ఈ ప‌రిస్థితి తెలుగు ప్ర‌జ‌ల‌కు క‌ల‌గ‌కూడ‌ద‌ని భావించి వెంట‌నే ఇరు తెలుగు రాష్ట్రాల్లో అన్ని జిల్లా హెడ్ క్వార్ట‌ర్స్ లోనూ చిరంజీవి ఆక్సిజ‌న్ బ్యాంకుల్ని స్థాపించారు. వీటి కోసం కోట్లాది రూపాయ‌ల్ని ఖ‌ర్చు చేశారు. ఆక్సిజ‌న్ బ్యాంకులు వేలాది ప్రాణాల్ని కాపాడాయ‌ని చిరంజీవి ట్ర‌స్ట్ వ‌ర్గాలు వెల్ల‌డిస్తున్నాయి. ఆప‌ద‌లో అన్నం పెట్ట‌డ‌మే కాదు ప్రాణ‌దానం చేయ‌గ‌ల‌మ‌ని మ‌రోసారి మెగాస్టార్ నిరూపించారు. అందుకే ఈసారి బ‌ర్త్ డే ఎంతో ప్ర‌త్యేకం. ఈసారి కేవ‌లం అభిమానులే కాదు.. ఆయ‌న అందించిన ఆక్సిజ‌న్ తో ప్రాణాలు కాపాడుకున్న‌ వారంతా ఈసారి ప్ర‌త్యేకంగా మెగాస్టార్ పుట్టిన‌రోజును సెల‌బ్రేట్ చేస్తార‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.

మెగాస్టార్ చిరంజీవి తన పుట్టినరోజును ఆగస్టు 22 న జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం మెగాభిమానులు అతని వేడుకలను పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తారు. ఈ సంవత్సరం కూడా దీనికి భిన్నంగా లేదు. అఖిల భారత చిరంజీవి యువత ఇప్పటికే బిగ్ డే కోసం ముందుగానే ప్రణాళిక వేసింది. ఈ సంవత్సరం వారు చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా చేయవలసిన కొత్త నినాదాన్ని విడుదల చేశారు. దేశాన్ని ప్ర‌పంచాన్ని మహమ్మారి పీడించిన‌ట్టు మునుముందు ప‌ర్యావ‌ర‌ణం ప్ర‌మాద‌క‌రంగా మార‌నుంది. అందుకే చిరంజీవి నుండి ప్రేరణ పొంది ``పర్యావరణాన్ని కాపాడటానికి ప్ర‌తి ఒక్క‌రూ త‌మ వంతు బాధ్య‌త‌గా ఒక మొక్కను నాటాలి!`` అనే నినాదాన్ని తెర‌పైకి తెచ్చారు. ఆగస్టు 9 నుండి ఆగస్టు 22 వరకు వారు ప్రతి మెగా అభిమానిని తొమ్మిది మొక్కలు నాటాలని ఆదేశాలు అందుకున్నారు. చిరంజీవి పుట్టినరోజు వేడుకలు జరిగే అన్ని ప్రాంతాలలో మొక్కలు నాటే కార్య‌క్ర‌మం జరుగుతుంది. ఇప్ప‌టికే 50రోజుల్లో చిరంజీవి పుట్టినరోజు వేడుకల పోస్టర్ ను విడుదల చేశారు.# ChiruBday2020 వైర‌ల్ గా మారుతోంది.

మెగాస్టార్ ప్ర‌స్తుతం న‌టిస్తున్న ఆచార్య త‌ర్వాత లూసీఫ‌ర్ రీమేక్ లో న‌టిస్తారు. బ్యాక్ టు బ్యాక్ న‌లుగురు ద‌ర్శ‌కుల్ని ఆయ‌న ఫైన‌ల్ చేసి స్క్రిప్టు ప‌నిలో ఉన్న సంగ‌తి తెలిసిందే.