Begin typing your search above and press return to search.
ఇంకా ఎందుకు ఈ ‘భీష్మ’ వివాదం?
By: Tupaki Desk | 13 March 2020 4:45 AM GMTనితిన్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా ఛలో దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో వచ్చిన ‘భీష్మ’ చిత్రం ప్రేక్షకులను మెప్పించింది. నితిన్ కు కొంత గ్యాప్ తర్వాత మరో విజయంను భీష్మ తెచ్చి పెట్టింది. ఇక భీష్మ సినిమా వచ్చి వారాలు గడిచి పోతున్న నేపథ్యంలో థియేటర్ల నుండి కూడా దాదాపుగా తీసేశారు. ప్రేక్షకులు మెల్ల మెల్లగా భీష్మ సినిమా గురించి మర్చి పోతున్నారు. అయినా కూడా గంగపుత్ర సంక్షేమ సంఘం వారు మాత్రం భీష్మ యూనిట్ సభ్యులను వదిలి పెట్టడం లేదు.
తాజాగా గంగపుత్ర సంక్షేమ సంఘం అధ్యక్షుడు అయిన రాజేశ్వరరావు మానవ హక్కుల కమీషన్ కు ఈ సినిమా పై ఫిర్యాదు చేశాడు. భీష్ముడిని ఆరాధించే మా మనోభావాలు దెబ్బ తీసే విధంగా సినిమాలో కొన్ని సీన్స్ ఉన్నాయంటూ ఆయన ఫిర్యాదులో పేర్కొన్నాడు. గతంలోనే భీష్మ చిత్రం పై ఆయన మీడియా ముందుకు వచ్చి విమర్శలు చేయడం తో పాటు టైటిల్ ను మార్చాలంటూ డిమాండ్ చేశాడు. ఇప్పుడు ఏకంగా మానవ హక్కుల కమీషన్ వద్దకు వెళ్లి ఫిర్యాదు చేయడం చర్చనీయాంశం అయ్యింది.
సినిమా విడుదల అయ్యి ఫుల్ రన్ కూడా అయిన నేపథ్యం లో ఎందుకు ఆయన ఈ ఫిర్యాదు చేసినట్లు గా సినీ వర్గాల వారు ప్రశ్నిస్తున్నారు. సినిమా విడుదలై రన్ పూర్తి అయిన కారణంగా ఆ ఫిర్యాదు గురించి పెద్దగా పట్టించుకోనక్కర్లేదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తుండగా మరికొందరు మాత్రం నిర్మాతల నుండి డబ్బులు వసూళ్లు చేసేందుకు ఇలాంటి పనులు చేస్తున్నారేమో అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.