Begin typing your search above and press return to search.

డార్లింగ్ క్యాప్ వెనక కథేంటి..??

By:  Tupaki Desk   |   19 April 2021 8:49 AM GMT
డార్లింగ్ క్యాప్ వెనక కథేంటి..??
X
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ కలిగి ఉన్నాడు. బాహుబలి సినిమా దగ్గరనుండి ప్రభాస్ పాన్ ఇండియా హీరోగా కొనసాగుతున్నాడు. ఇప్పుడు అదే రేంజికి తగ్గట్టుగా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ నుండి సాహో సినిమా వచ్చింది. ఆ సినిమాకు టాక్ నెగటివ్ వచ్చినప్పటికి కలెక్షన్స్ మాత్రం భారీగానే రాబట్టింది. మొత్తానికి సినిమా లాస్ అయితే చేయలేదని తెలిసిందే. అయితే సాహో తర్వాత ప్రభాస్ నుండి రాధేశ్యామ్ సినిమా రాబోతుంది. ఈ సినిమా చివరి షెడ్యూల్ తాజాగా ఫినిష్ చేసాడు ప్రభాస్. ఇదివరకే షూటింగ్ పూర్తయినప్పటికి ఓ పది రోజుల కొరకు ప్రభాస్ ముంబై నుండి హైదరాబాద్ వచ్చాడు.

అయితే తాజాగా రాధేశ్యామ్ సినిమా పూర్తి చేసాక ప్రభాస్ నయా లుక్ అందరిని అట్ట్రాక్ట్ చేస్తోంది. అందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రభాస్ హెయిర్ క్యాప్ ధరించి కవర్ చేయడంతో అందరికి సందేహాలు మొదలయ్యాయి. మరి ఆ క్యాప్ వెనక కథేంటని అనుకుంటుండగా.. ప్రభాస్ ఏదో న్యూ హెయిర్ స్టైల్ గురించి అలా క్యాప్ అడ్డు పెట్టినట్లు సినీవర్గాలు చెబుతున్నాయి. మరి అసలు కథేంటి అనేది తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే. అయితే పీరియడిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిన రాధేశ్యామ్ మూవీ ఈ ఏడాది జులై 30న రిలీజ్ చేయనున్నట్లు ఇదివరకు మేకర్స్ ప్రకటించారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి కరోనా పరిస్థితుల దృష్ట్యా సినిమా వాయిదాపడే అవకాశం కూడా ఉంది. చూడాలి మరి ఏం జరగనుందో.. ఈ సినిమాను రాధాకృష్ణకుమార్ డైరెక్ట్ చేయగా యూవి క్రియేషన్స్ వారు నిర్మించారు. పూజాహెగ్డే హీరోయిన్ గా నటించింది.