Begin typing your search above and press return to search.

ఫొటోటాక్‌ : ధనుష్‌ కు ఇంత పెద్ద పిల్లలున్నారా?

By:  Tupaki Desk   |   24 Aug 2020 4:00 AM GMT
ఫొటోటాక్‌ : ధనుష్‌ కు ఇంత పెద్ద పిల్లలున్నారా?
X
కోలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ అల్లుడు స్టార్‌ హీరో ధనుష్‌ ప్రస్తుతం కరోనా లాక్‌ డౌన్‌ కారణంగా గత కొన్ని నెలలుగా పూర్తిగా ఇంటికే పరిమితం అయ్యాడు. ఈ సమయంలో అందరు హీరోల మాదిరిగానే ఈయన కూడా కుటుంబ సభ్యులతో టైం స్పెండ్‌ చేస్తున్నాడు. చాలా కాలం తర్వాత ధనుష్‌ తన కొడుకు ఫొటోలను నెట్టింట షేర్‌ చేశాడు. అ ఫొటోల్లో వారిని చూసిన రజినీకాంత్‌ అభిమానులు మరియు ధనుష్‌ అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అప్పుడే పిల్లలు ఇంత పెద్ద వారు అయ్యారా అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

రజినీకాంత్‌ తర్వాత ఆయన వారసులుగా కూతుర్లు సినిమా రంగంలో అడుగు పెట్టారు. అయితే వారు నటనలో ఎంట్రీ ఇవ్వలేదు. అయితే రజినీకాంత్‌ మనవళ్లు అయిన వీరిద్దరు త్వరలోనే హీరోలుగా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. తండ్రి మరియు తాత వారసత్వంతో వీరిద్దరు హీరోలుగా ఎంట్రీ ఇస్తే చూడాలని ఆశగా ఉంది అంటూ ఫ్యాన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు. ఈ ఖాళీ సమయంను ధనుష్‌ ఇంటి పైన చల్లని సాయంత్రాన పిల్లలతో కబుర్లు చెబుతున్నట్లుగా ఈ ఫొటో చూస్తుంటే అనిపిస్తుంది కదా. ప్రస్తుతం ధనుష్‌ రెండు మూడు ప్రాజెక్ట్‌ లను లైన్‌ లో పెట్టాడు. కరోనా పోయిన వెంటనే వాటిని ప్రారంభించే అవకాశం ఉంది.