Begin typing your search above and press return to search.

బన్నీకి చరణ్‌ కు అదే తేడా

By:  Tupaki Desk   |   3 Feb 2019 1:30 AM GMT
బన్నీకి చరణ్‌ కు అదే తేడా
X
టాలీవుడ్‌లో ఒక సినిమా కోసం బాగా కష్టపడే హీరో ఎవరు అని అడిగితే.. తడుముకోకుండా ప్రతీ ఒక్కరూ చెప్పే పేరు అల్లు అర్జున్‌. సినిమాకు ప్రాణం పెట్టేస్తాడు బన్నీ. డ్యాన్సుల కోసం అయితే.. రోజుకి 20 గంటలు కష్టపడతాడు. డ్యాన్సులు మాత్రమే కాదు.. తన పాత్ర బాగా రావాలని దానికోసం మేకోవర్‌ అవుతాడు. ఢిఫరెంట్‌ కాస్ట్యూమ్‌ - హెయిర్‌ స్టైల్‌ ఇలా ఏదో ఒకటి ట్రై చేస్తూనే ఉంటాడు. ఇప్పుడు త్రివిక్రమ్‌ సినిమా కోసం బాగా సన్నగా కన్పించేదుకు సిద్ధమయ్యాడు బన్నీ.

ప్రతీ సినిమాకు తననుంచి ఏదో ఒక స్పెషాలిటీ ఉండాలనుకునే బన్నీ.. నా పేరు సూర్య - సరైనోడు సినిమాల కోసం కండలు పెంచాడు. నాపేరు సూర్యలో మిలటరీ సోల్జర్‌ గెటప్ కోసం కంటికి గాటు పెట్టుకున్నాడు. దువ్వాడ జగన్నాథమ్‌ బ్రాహ్మణుల స్లాంగ్‌ నేర్చుకున్నాడు. కానీ ఇదే టైమ్‌లో బన్నీకి అసలైన కాంపిటీటర్‌ రామ్‌ చరణ్‌ మాత్రం ఇలాంటివి ఏం పట్టించుకోడు. సినిమా ఒప్పుకున్నామా - చేశామా - వెళ్లిపోయామా అన్నట్లుగా ఉంటాడు. మగధీర సినిమా తర్వాత చరణ్‌ చాలా సినిమాలు చేశాడు. చేసిన ప్రతీ సినిమాలో ఒకేలా కన్పిస్తున్నాడు. వినయ విధేయ రామ్ - రచ్చ - నాయక్‌ - గోవిందుడు అందరివాడేలే.. ఈ సినిమాలో ఉన్న పోస్టర్స్‌ అన్నీ పక్కనపెట్టి చూస్తే.. ఏ స్టిల్‌ ఏ సినిమాలోదో చెప్పడం చాలా కష్టం. కొత్తదనం కోసం ట్రై చేయకపోవడం వల్లే చరణ్‌ సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడడం లేదు. ఇప్పటికైనా చరణ్‌.. తన లుక్‌ పై దృష్టి పెట్టాలి. బన్నీని చూసి నేర్చుకోవాలి.