Begin typing your search above and press return to search.
ప్రభాస్ కోసం డిఫరెంట్ హెయిర్ స్టైల్..?
By: Tupaki Desk | 30 Jun 2021 2:30 PM GMTచిత్రపరిశ్రమలో సినిమాలకు కోసం ఏదైనా చేసేస్తుంటారు కొందరు తారలు. అయితే ఇదివరకు ఉన్నటువంటి టెక్నాలజీ కంటే ఇప్పుడు ఉన్న టెక్నాలజీ ఎంతో మెరుగ్గా ఉంది కాబట్టి మేకర్స్ కూడా ఎలాంటి రిస్క్ చేయడానికైనా వెనకాడటం లేదు. ఈ మధ్యకాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి మాములు సినిమాల సంఖ్యతో పాటు పాన్ ఇండియా చిత్రాల సంఖ్య కూడా పెరుగుతూ పోతుంది. పాన్ ఇండియా హీరో డార్లింగ్ ప్రభాస్.. ప్రస్తుతం రాధేశ్యామ్ ప్రేమకథాచిత్రం పూర్తిచేసి సలార్ అనే మాస్ యాక్షన్ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. పక్కా సాలిడ్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా సలార్ మూవీ తెరకెక్కుతుంది.
కేజీఎఫ్ మూవీతో సాలిడ్ బ్లాక్ బస్టర్ అందుకొని సాలిడ్ క్రేజ్ దక్కించుకున్న ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ తెరకెక్కుతోంది. అయితే ప్రభాస్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్ పై అలాగే సలార్ సినిమా పై అంచనాలు మాత్రం ఓ లెవెల్లో నెలకొన్నాయి. ఈ చిత్రం వచ్చే ఏడాది రిలీజ్ కాబోతుండగా ఇదివరకు ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో ప్రభాస్ నెవర్ బిఫోర్ లుక్కులో కనిపించనున్నట్లు సలార్ పోస్టర్ చూస్తే అర్ధమవుతుంది. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. డార్లింగ్ - శృతిహాసన్ కాంబినేషన్ కెమిస్ట్రీ కూడా అదిరిపోతుందని టాక్.
ఇదిలా ఉండగా.. తాజాగా ఎన్నో ఊహగానాల మధ్య సలార్ సినిమాలో ప్రభాస్ లుక్ పై చర్చలు జరుగుతున్నాయి. అందులోను ప్రభాస్ హెయిర్ స్టైల్ విషయంలో మేకర్స్ చాలా కేర్ తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. అందుకే బాలీవుడ్ స్టైలిస్ట్ ను పిలిచి మరీ ప్రభాస్ హెయిర్ స్టైల్ సెట్ చేస్తున్నారని సమాచారం. కేవలం ప్రభాస్ హెయిర్ స్టైల్ కోసమే మేకర్స్ లక్షల్లో ఖర్చు పెడుతున్నారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. మరి ఆ స్టైలిస్ట్ ఎవరినేది తెలియాల్సి ఉంది. ఇక త్వరలోనే సలార్ సెకండ్ షెడ్యూల్ ప్రారంభం కాబోతుంది. మేకర్స్ ఆల్రెడీ భారీ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ చిత్రాన్ని హోంబలే ఫిలిమ్స్ వారు నిర్మిస్తున్నారు.