Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ: ఫ్రైడే ఫ్రై చేస్తున్న దిశ పటాని

By:  Tupaki Desk   |   20 Dec 2019 7:17 AM GMT
ఫోటో స్టోరీ: ఫ్రైడే ఫ్రై చేస్తున్న దిశ పటాని
X
హాటు భామలు ఎంతో మంది ఉన్నప్పటికీ వారిలో దిశా పటాని రేంజ్ వేరు. సినిమాల్లో హీరోగా రజనీకాంత్ కు ఎలాంటి ఇమేజ్ ఉందో..గ్లామర్ విషయంలో దిశా పటానికి అలాంటి ఇమేజ్ ఉంది. ఎంతమంది హాటు భామలు ఉన్నా దిశా రాగం.. తాళం వేరు. అందుకే పటాని ఒక్క ఫోటో పోస్ట్ చేస్తే సోషల్ మీడియా షేక్ అవుతుంది. ఇప్పటికే ఈ కార్యక్రమాన్ని ఎన్నో సార్లు విజయవంతంగా పూర్తి చేసిన దిశా మరోసారి అదే పని చేసింది.

పటాని తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటోకు "మై కాల్విన్స్" అంటూ క్యాప్షన్ ఇచ్చింది. హైదరాబాద్ అనగానే జనాలకు చార్మినార్ ఎలా గుర్తుకువస్తుందో అలానే దిశా పటాని అనగానే కాల్విన్ క్లెయిన్ గుర్తొస్తుంది. ఆ బ్రాండుకు అంత పాపులారిటీ తీసుకొచ్చిన పటాని మరోసారి అదే బ్రాండ్ ఇన్నర్ వేర్ లో మెరిసింది. బ్లూ కలర్ కాల్విన్స్ ధరించి ఒంపుసొంపుల వయ్యారి భామలా.. ఖజురహో శిల్పాలకు ఈతరం అంబాజిడర్ లా నిలుచుంది. కళ్ళు మూసుకుని వగలుపోతూ ఇచ్చిన ఆ ఎక్స్ ప్రెషన్ చూస్తే తీవ్రమైన మహిళా ద్వేషి కూడా పటాని ఆరాధకుడుగా మారిపోతాడు.

దిశ పటాని ఫోటో పోస్ట్ చెయ్యడం.. సోషల్ మీడియా షేక్ కాకుండా ఉండడం ఎప్పటికీ జరగదు. ఈసారికూడా నెటిజన్ల స్పందన అదిరిపోయింది. ఇప్పటి వరకూ ఈ ఫోటోకు 1.7 మిలియన్స్ కు పైగా లైక్స్ వచ్చాయి.. ఇంట్రెస్టింగ్ కామెంట్లు కూడా పెట్టారు.. "టైగర్ ష్రాఫ్ కు నచ్చిందా".. "ఫ్రైడే మమ్మల్ని ఫ్రై చేస్తున్నావా?".. "ఫస్ట్ లవ్ కాల్విన్స్.. సెకండ్ లవ్ టైగర్" అంటూ రెచ్చిపోయారు. దిశా సినిమాల విషయనికి వస్తే ప్రస్తుతం 'మలంగ్' అనే చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాలో హీరో ఆదిత్య రాయ్ కపూర్. అనిల్ కపూర్.. కునాల్ ఖేము ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.