Begin typing your search above and press return to search.

ఈటివి ప్రభాకర్ అలా వచ్చేశాడంట

By:  Tupaki Desk   |   3 Jun 2016 11:30 AM GMT
ఈటివి ప్రభాకర్ అలా వచ్చేశాడంట
X
ఒకప్పుడు ఈటివి ఛానల్‌ కాస్త డౌన్‌ లోకి వెళ్ళింది. అప్పట్లో జెమెని అండ్‌ మా టివిలు కొత్త కొత్త కాన్సెప్టులతో చితక్కొట్టేయడంతో.. ఈటివి రేటింగ్‌ కాస్త తగ్గింది. ఆ సమయంలో.. ఓ ఇద్దరు ఈటివిని కొత్త లెవెల్ లోకి తీసుకెళ్ళారు. ఒకటి ఈటివి అధినేత రామోజీరావు కుమారుడు సుమన్‌ అయితే.. రెండోది డైరక్టర్‌-యాక్టర్-రైటర్‌ ప్రభాకర్‌. ఇక తండ్రి కొడుకుల మధ్యన మనోడు చిచ్చుపెడుతన్నాడనే నెపంతో.. మనోడ్ని బయటకు పంపేశారు అనేది అందరికీ తెలిసిన టాపిక్కే. ఆ ఉదంతానే ప్రభాకర్‌ ఈ మధ్యనే వివరించాడు.

''చాలా చాలా పాలిటిక్స్ చోటుచేసుకున్నాయి. దానితో ఛానల్‌ లో సుమన్ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా.. ఆ ప్రభాకర్ గాడు ఏదో చెప్పుంటాడు అనే అపవాదు వచ్చేసింది. ఒకరోజు 2-4 స్లాట్‌ లో వస్తున్న ప్రోగ్రామ్స్ బాలేదని నేను సుమన్ కు చెబితే.. ఆయన వాటి టైమింగ్‌ మార్చమని చెప్పారు. నేను మార్పించేశాను. కాని నాకు తెలియని విషయం ఏంటంటే.. ఆ 2-4 స్లాట్‌ టైమింగ్స్ రామోజీరావు గారే చూస్తున్నారని. ఒక రోజు ఆయన ఆఫీస్‌ నుండి కాల్‌ వచ్చింది. అదే ఆయన్ను తొలిసారి ఆఖరిసారి కలవడం. నువ్వు చాలా ఎక్సట్రాలు చేస్తున్నావ్‌.. నువ్వు చేసిన ప్రోగ్రామ్‌ లకు ఏమన్నా విపరీతంగా డబ్బులొస్తున్నాయా అన్నారు. అదేంటి సార్ నా ప్రోగ్రామ్స్ ఎంత ప్రాఫిటబుల్‌ అనేది ఇండియా టుడేలోనే ఆర్టికల్స్ వచ్చాయి.. మీరు రావట్లేదంటే నేను నమ్మలేను అన్నాను. సరే నీ వలన మా తండ్రీ కొడుకుల మధ్యన అనవసరమైన గొడవలు వస్తున్నాయి. ఇప్పుడేం చేద్దాం? అన్నారాయన. నేను వదిలేసి వెళిపోతాను సార్‌ అన్నాను. ఓకె వెళిపో అన్నారు. మరు క్షణం రిజైన్ చేసి బయటకు వచ్చేశా'' అంటూ వివరించాడు ప్రభాకర్‌.

తాను చేసిన ప్రోగ్రామ్స్ అన్నీ కేవలం ఈటివి మెరుగుకోసమే చేశానే తప్పించి.. ఏదో రామోజీరావు అండ్‌ సుమన్‌ మధ్యన తగాదాలు తీసుకురావడానికి కాదని.. అలాగే ఎంతోమంది ఎంతో ఐకానిక్‌ గా భావించే రామోజీ రావు గారితో తాను అలా నెగెటివ్‌ ఇంప్రెషన్‌ వేయించుకోవడం కూడా బాధించే అంశమని మనోడు చెప్పుకొచ్చాడు. ఆ తరువాత మనోడు జీ తెలుగు వంటి ఛానల్స్ లో అనేక సీరియళ్లు రాసి, నటించి, ప్రొడ్యూస్‌ చేసి తిరిగి సక్సెస్ చవిచూసిన సంగతి తెలిసిందే.