Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: బావుంద‌మ్మోవ్ ర‌ష్మికా ఈ సెల్ఫీ ఫోజు

By:  Tupaki Desk   |   21 Oct 2020 12:10 PM GMT
ఫోటో స్టోరి: బావుంద‌మ్మోవ్ ర‌ష్మికా ఈ సెల్ఫీ ఫోజు
X
స‌క్సెస్ జోష్ అంటే ఎలా ఉంటుందో ర‌ష్మిక‌ను చూస్తే తెలుస్తుంది. ఓవైపు ప‌ట్టింద‌ల్లా బంగారంలా మారుతుంటే ఈ కుర్ర‌బ్యూటీ య‌మ‌స్పీడ్ చూపిస్తోంది. ఓవైపు సినిమాల్లో న‌టిస్తూనే మ‌రోవైపు సోకిల్లాడిలా ఇన్ స్టా మాధ్య‌మంలో రెగ్యులర్ ఫోటో వీడియో ట్రీట్ తో ఆక‌ర్షిస్తోంది. నిరంత‌రం క‌మ‌ర్షియ‌ల్ ప్ర‌క‌ట‌న‌ల‌తో నాలుగు చేతులా ఆర్జిస్తోంది. సినిమాలతో పారితోషికం ప‌రంగా భారీగానే ఆర్జిస్తోంది. దానికి ప్ర‌క‌ట‌న‌ల ఆదాయం అద‌నంగా క‌లిసొస్తోంది. లాక్ డౌన్ లో ర‌ష్మిక ఈ త‌ర‌హా ఆదాయాన్ని బాగానే సాముపార్జించిందిట‌.

రష్మిక మంద‌న్న ఇటీవ‌ల ఫిట్నెస్ ఫ్రీక్ గా మారాక సాటి నాయిక‌ల‌తో పోటీప‌డుతోంది. రెగ్యుల‌ర్ గా స్కిప్ కొట్ట‌కుండా జిమ్ కి వెళుతోంది. ఇదిగో ఇదే లేటెస్ట్ ప్రూఫ్. తాజాగా త‌న‌ ఫిట్‌నెస్ గేమ్ గురించి అభిమానులను అప్ ‌డేట్ చేసేందుకు రష్మిక ప్రిప‌రైందిలా. ``హస్టిల్ గా ఉంది..`` అనే క్యాప్షన్ తో ఓ స్పోర్ట్ బ్రాండ్ కి ప్ర‌మోష‌న్ చేస్తోందిలా. అటు బెంగళూరులో అయినా..ఇటు హైదరాబాద్ ‌లో అయినా జిమ్ కు వెళ్లేటప్పుడు ఈ స్పెష‌ల్ బ్రాండ్ ట్రాక్ ని స్పోర్ట్ డ్రె‌స్ ని ఎంపిక చేసుకుంటోంద‌ట‌.

కెరీర్ ప‌రంగా చూస్తే.. కన్నడ చిత్రం పోగారులో ధ్రువ సర్జా స‌ర‌స‌న న‌టిస్తోంది. తెలుగులో పుష్ప చిత్రంలోనూ నాయిక‌గా న‌టిస్తోంది. అటు త‌మిళంలోనూ కార్తీ స‌ర‌స‌న అవ‌కాశం అందుకుంది. అల్లు అర్జున్ -సుకుమార్ కాంబినేష‌న్ లోని పుష్ప వచ్చే నెలలో షూటింగ్ తిరిగి ప్రారంభమవుతుంది. అప్ప‌టికి ర‌ష్మిక ఈ టీమ్ తో జాయిన్ అవుతుంద‌ట‌.