Begin typing your search above and press return to search.

'గాడ్సే' తో మైండ్ గేమ్ ఆడుతున్న టాలెంటెడ్ యాక్టర్..!

By:  Tupaki Desk   |   11 Feb 2021 12:19 PM GMT
గాడ్సే తో మైండ్ గేమ్ ఆడుతున్న టాలెంటెడ్ యాక్టర్..!
X
వైవిధ్యమైన కథలు ఎంచుకుంటూ విలక్షణ నటనతో ముందుకెళ్తున్న వర్సటైల్ యాక్టర్ సత్యదేవ్‌.. 'బ్రోచేవారెవరు రా' 'బ్లఫ్ మాస్టర్' 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' సినిమాలతో హీరోగా నిలదొక్కుకున్నాడు. ఈ క్రమంలో 'బ్లఫ్ మాస్టర్' ఫేమ్ గోపిగణేశ్‌ పట్టాభి దర్శకత్వంలో 'గాడ్సే' అనే మరో వైవిధ్యమైన సినిమా చేస్తున్నాడు సత్యదేవ్. సి.కె. స్ర్కీన్స్‌ బ్యానర్‌ పై ప్రముఖ నిర్మాత సి. కల్యాణ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ సినిమాతో పాపులర్ మలయాళ నటి ఐశ్వర్య లక్ష్మి తెలుగులో హీరోయిన్‌ గా ప‌రిచ‌య‌మ‌వుతోంది. 'గాడ్సే' రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైనట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.

'గాడ్సే' సినిమా మైండ్ గేమ్ ప్లాట్ తో ఉండబోతోందని మేకర్స్ వెల్లడించారు. ఈ సందర్భంగా సత్యదేవ్ కి సంబంధించిన ఓ పోస్టర్ ని వదిలారు. ఇందులో సత్యదేవ్ ఫేస్ మీద గాట్లు చూస్తుంటే ఇప్పటివ‌ర‌కూ చేయ‌ని భిన్న త‌ర‌హా క్యారెక్టర్‌ లో కనిపిస్తాడని తెలుస్తోంది. ఇప్పటికే విడుద‌ల చేసిన ఈ మూవీ టైటిల్ పోస్టర్‌ కు కూడా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ చిత్రంలో నాజర్‌ - బ్రహ్మాజీ - ఆదిత్య మీనన్‌ - కిశోర్‌ తదితరులు నటించనున్నారు. ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ సంగీతం సమకూర్చనున్నారు. ‘బ్లఫ్ మాస్టర్‌` వంటి హిట్ సినిమా తర్వాత స‌త్యదేవ్‌ - గోపి గ‌ణేష్ ప‌ట్టాభి కాంబినేషన్‌ లో వస్తున్న ఈ యాక్షన్ ప్యాక్‌డ్ థ్రిల్లర్‌ ఎలా ఉంటుందో చూడాలి.