Begin typing your search above and press return to search.
జిమ్ లో సుత్తి.. హీరో సుధీర్ బాబు ఫిట్నెస్ టెస్ట్?
By: Tupaki Desk | 23 Jan 2021 11:00 AM GMTనటించిన మొదటి సినిమాతోనే సుధీర్ బాబులోని కఠినాతికఠినమైన జిమ్మర్ బయటపడ్డాడు. ఆడియో వేదికపైనే గగుర్పొడిచే జిమ్నాస్టిక్ విన్యాసాలతో బావ మహేష్ కే షాక్ తినిపించాడు. టాలీవుడ్ లో బన్ని తర్వాత 6ప్యాక్ తో బరిలో దిగిన హీరో అన్న టాక్ కూడా వినిపించింది.అనంతరం భాఘి2లో కండల విలన్ గా అదరగొట్టాడు. ఇటీవల వీలోనూ స్టైలిష్ లుక్ తో పర్ఫెక్ట్ ఫిట్ బాడీతో అలరించాడు. ఇదిగో ఇప్పటికీ ఎప్పటికీ ఆ వేడి అతడిలో తగ్గేట్టు లేదు.
ఇప్పుడు ఏకంగా సుత్తి పట్టుకుని జిమ్ కెళుతూ షాకిస్తున్నాడు.జిమ్ లో సుత్తి ని ఇలా కూడా వాడొచ్చా అనిపిస్తున్నాడు సుధీర్ బాబు. శరీర ధృఢత్వాన్ని ఇదిగో ఇలా కూడా చెక్ చేయొచ్చు అన్నట్టు ఎంతో ఫన్నీగా అలా చేస్తున్నాడు.ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన వీడియోల వరుసలో.. అతను జిమ్ లోని బెంచ్ పై కూర్చుని సుత్తిని తనపైనే ప్రయోగించిన క్లిప్స్ షాక్ కి గురి చేస్తున్నాయి. తన చేతులు.. తొడలు.. దవడ కండరాల పటుత్వాన్ని చెక్ చేశాడు.
త్వరలో జాతీయ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెలా గోపిచంద్ ఆధారంగా తెరకెక్కించనున్న బయోపిక్ లో కనిపించనున్నారు. సుధీర్ మాజీ బ్యాడ్మింటన్ ఆటగాడు. అతను ఆంధ్రప్రదేశ్ లో నంబర్ వన్ ఆటగాడిగా కొనసాగారు. పుల్లెల గోపీచంద్‌తో కలిసి డబుల్స్ భాగస్వామిగా ఒకసారి ఆడాడు. అనంతరం అతడు ఘట్టమనేని కృష్ణ కుమార్తెను పెళ్లాడాక.. హీరోగా బరిలో దిగారు.