Begin typing your search above and press return to search.

జీరో సైజ్ పిచ్చి ఇంకా పోలేదేమిటి హ‌న్సికా?

By:  Tupaki Desk   |   30 Jan 2021 5:30 PM GMT
జీరో సైజ్ పిచ్చి ఇంకా పోలేదేమిటి హ‌న్సికా?
X
జీరో సైజ్ అన‌గానే తొలిగా బెబో క‌రీనాక‌పూర్ పేరు వినిపిస్తుంది. ఆ త‌ర్వాతే ఇంకెవ‌రైనా. త‌షాన్ స‌మ‌యంలో బెబో జీరో సైజ్ తో ఒక్క‌సారిగా బాలీవుడ్ లో అగ్గి రాజేసింది. ఆ త‌ర్వాత అది యూత్ లో అంతే వైర‌ల్ గా మారింది. సాటి క‌థానాయిక‌లు స‌హా యువ‌త‌రం పిచ్చిగా జీరో సైజ్ లుక్ కోసం త‌పించారు.

ఇప్ప‌టికీ ఆ పిచ్చి అలానే ఉంది. తాజాగా సౌత్ బ్యూటీ హన్సిక మోత్వానీ జీరో సైజ్ కోసం నానా తంటాలు ప‌డుతోంద‌ని త‌న ఇన్ స్టా ఫోటోలు చెప్ప‌క‌నే చెబుతున్నాయి. హ‌న్సిక పూర్తిగా జీరో రేంజుకి త‌గ్గిపోయింది. ఇక ఆ స‌న్న‌జాజి న‌డుమును చూస్తే హ‌వ్వ‌.. ఇది ఆపిల్ బ్యూటీ న‌డుమేనా? అంటూ క‌న్ఫ్యూజ‌న్ కి గుర‌వ్వాల్సిందే. అంత‌గా సన్న‌బ‌డి పీల‌గా క‌నిపిస్తోంది. ఇక ఆ ముఖంలో కూడా జీవం క‌నిపించ‌డం లేదని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

అయితే ఇదంతా దేనికోసం అంటే త‌న కెరీర్ ని మ‌రింత ఫ్రెష్ గా రీలాంచ్ చేసేందుకేన‌ట‌. రెండు ద‌శాబ్ధాల‌కు చేరువ అవుతున్నా త‌న రేంజు సాటి నాయిక‌ల‌తో పోలిస్తే తీసిక‌ట్టుగానే ఉంద‌న్న ఆందోళ‌న ఉంది. ఈ రోజు ఉదయం ముంబై విమానాశ్రయంలో ఆమె తెలియని ప్రదేశానికి వెళుతుండగా అంతే స‌న్న‌జాజిలా క‌నిపించింది.

హన్సికా కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. మహా అనే థ్రిల్లర్ లో న‌టిస్తోంది. ఇది హ‌న్సిక కెరీర్ 50వ చిత్రం. త్వ‌ర‌లోనే రిలీజ్ కానుంది. యు.ఆర్.జమీల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఎట్సెటెరా ఎంటర్ ఐట‌న్మెంట్ మహా ప్రొడక్షన్ బ్యానర్లో మాథి అజగన్ నిర్మించారు. ఈ చిత్రంలో హన్సిక మోత్వానీ మాజీ ల‌వ‌ర్ కోలీవుడ్ స్టార్ సింబు ఓ ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నారు. ఇప్పటికే 2019 లో కొన్ని సన్నివేశాల కోసం ఈ జంట క‌లిసి న‌టించారు.